Share News

కూటమి.. సునామీ

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:39 AM

డోన్‌,ఆళ్లగడ్డ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. ప్యాపిలి మినహా మిగతా అన్ని జడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే అత్యధిక ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందడంతో ఎంపీపీగా కూటమి అభ్యర్థులే ఎన్నికయ్యే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపించాయని విజేతలు పేర్కొన్నారు.

కూటమి.. సునామీ
ఆళ్లగడ్డలో ఓట్లు లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బంది

ఆళ్లగడ్డ, డోన్‌ నియోజకవర్గాలలోని అత్యధిక ఎంపీటీసీ స్థానాలు కైవసం..

ప్యాపిలి మినహా అన్ని స్థానాలు కూటమి పార్టీల కైవసం

టీడీపీ నాయకులు, కార్యర్తలు సంబరాలు

డోన్‌ జడ్పీటీసీ టీడీపీ కైవసం

23,160 ఓట్లతో రేగటి లక్ష్మీ వేదవతి గెలుపు

డోన్‌ టౌన్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండల జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. శనివారం పట్టణంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 7 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎనినకల కౌంటింగ్‌ నిర్వహిచారు. టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రేగటి లక్ష్మి వేదవతి 23,160 ఓట్ల భారీ మెజారిటీతో సీపీఐ అభ్యర్థి రాజేశ్వరిపై గెలుపొందారు. ఆర్‌వో ఎన్‌.రామాంజనేయులు, డీఎల్‌డీవో భాస్కర్‌ రెడ్డి, తహసీల్దార్‌ రవి డిక్లరేషన్‌ ఫామ్‌ అందజేశారు. ఫలితం ప్రకటించాక జడ్పీటీఈ తండ్రి మాజీ సర్పంచ్‌ రేగటి రామ్మోహన్‌ రెడ్డి, భర్త రేగటి దిలీప్‌ రెడ్డి, రేగటి అర్జున్‌ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్‌, కొత్తపల్లి రంజిత్‌ కిరణ్‌, కనపకుంట మధురెడ్డి, కొత్తకోట శ్రీను, మిద్దెపల్లి గోవిందు, దేవరబండ రాము, రాజా నారాయణమూర్తి పాల్గొన్నారు.

కౌంటింగ్‌ వద్ద భారీ బందోబస్తు

డోన్‌ రూరల్‌: పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రూరల్‌ సీఐ రాకేష్‌ బాబు, రూరల్‌ ఎస్‌ఐ మమత నిరంతరం పర్యవేక్షించారు. సిబ్బంది కోసం హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు.

ఆళ్లగడ్డ: నియోజకవర్గంలోని ఎంపిటీసీ, జడ్పీటీసీ స్ధానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తా చాటారు. శనివారం పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓట్లు లెక్కించారు. మొత్తం 71 ఎంపిటీసీ స్ధానాలు, జడ్పీటీసీ స్తానం ఉండగా, టీడీపీ-42, వైసీపీ-25, జనసేన-4 స్ధానాలను కైవసం చేసుకొన్నారు. ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లె ఎంపటీసీగా కాసిపోగుల వీరన్న 1,331 ఓట్ల మెజార్టీతో, జి.జంబులదిన్నేకు వైసీపీ అభ్యర్తి మేకల లక్ష్మి 2182 ఓట్లతో గెలిచారు. అలాగే అహోబిలం ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్తి కోయన గుండ్ల భారతి 2,023 ఓట్లతో, ఆర్‌ క్రిష్ణాపురం టీడీపీ గూడురు రసూల్‌బీ 1,613 ఓట్లతో, నల్లగట్ల ఎంపిటీసి గా టిడిపి అభ్యర్థి గీతా వాణి 1,938 ఓట్లతో గెలిచారు. ఓబులంపల్లె టీడీపీ అభ్యర్థి దూదేకుల అశోక్‌ 2,069 ఓట్లతో, బాచేపల్లె టీడీపీ అభ్యర్థి మల్లేశ్వరి బాయ్‌1,892 ఓట్లతో, బత్తలూరుల టీడీపీ అభ్యర్థిగా మౌనిక 1,894 ఓట్లతో, కోట కందుకూరు వైసీపి అభ్యర్తి లక్ష్మిదేవి 1,811 ఓట్లతో, పాత కందుకూరులో జనసేన జి. ఉదయశ్రీ 1,916 ఓట్ల మెచార్టీతో విజయం సాధించారు. ఆళ్లగడ్డ జడ్పీటీసీగా పొరెడ్డి రాజశేఖర్‌రెడ్డి 15,745 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయానికి కృషి చేసిన ఎమ్మెల్యే అఖిలప్రియ, సహకరించిన మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

చాగలమర్రిలో టీడీపీదే విజయం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 6వసారి టీడీపీ విజయం సాదించింది. 15 స్థానాల్లో టీడీపీ 8, జనసేన 1, వైసీపీ 6 కైవసం చేసుకున్నారు. చాగలమర్రి 2వ ఎంపీటీసీ టీడీపీ బీజాన్‌, 4వ ఎంపీటీసీ జట్టి కుమార్‌, 5 - కొలిమి మహబూబ్‌బాషా, 6 - ఆకుల మెహరాన్‌బీ, ముత్యాలపాడు-1 జహరాబీ, మద్దూరు లక్ష్మిప్రసన్న, పెద్దబోనం సుశ్మిత, గొరగెనూరు దావీదు, చింతలచెరువు జనసేన దేవదాసు, చాగలమర్రి-1 సానియాబేగం, చాగలమర్రి-3 పర్మిళ, పెద్దవంగలి దద్దనాల జహరాబీ, డి.వనిపంట ప్రభావతమ్మ, మల్లెవేముల ఈదుల జ్యోతీశ్వర్‌రెడ్డి, ముత్యాలపాడు-2 హనుమానాయక్‌, జడ్పీటీసీ అభ్యర్థి చక్రవర్తులపల్లెకు చెందిన కె.నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. ఆర్వో సునీల్‌ ఖన్నా, ఎంపీడీవో తాహీర్‌హుస్సేన్‌ డిక్లరేషన్‌ పత్రాలు అందజేశారు.

చాగలమర్రి ఎంపీపీ పీఠం దక్కించుకున్న టీడీపీ

ఎంపీటీసీగా చిన్నవంగలికి చెందిన లక్ష్మిప్రసన్న 2 వేలకుపైగా మెజార్టీ సాధించి ఎంపీపీ పదవిని కైవసం చేసుకున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆర్వో సునీల్‌కన్నా, ఎంపీడీవో తాహీర్‌హుస్సేన్‌, తహసీల్దారు పవన్‌కుమార్‌రెడ్డి, డిక్లరేషన్‌ ఫారాన్ని అందజేశారు. నరసింహారెడ్డి, రమణారెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, వెంకటేష్‌, ఏవో నాగేంద్రప్రసాద్‌, కోఆర్డినేటర్‌ రాజ్‌కుమార్‌, పాల్గొన్నారు.

10 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ విజయం

శిరివెళ్ల: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. 17 ఎంపీటీసీ స్థానాలకు గాను 15 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ-10, వైసీపీ-5 దక్కాయి. కాగా ఇప్పటికే టీడీపీ-ృ, వైసీపీ-1 ఏకగ్రీవమైన విషయం విదితమే.

టీడీపీ అభ్యర్థులు యర్రగుంట్ల్ల-2 మేరువ శాంతి, జీనేపల్లె-దొమ్మరి రాధమ్మ, శిరివెళ్ల-2-పసుల స్వాతి శిరివెళ్ల-3- నాలి అబ్జల్‌, శిరివెళ్ల-4-బొంగు నౌషాద్‌, శిరివెళ్ల-5 సూరా లక్ష్మీదేవి, మహదేవపురం-బత్తిన మధు, గుండంపాడు-దాసి మేరి, కోటపాడు-వారాధి చంద్ర(1,981), చెన్నూరు-భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డి, గెలిచారు. కాగా గోవిందపల్లె-1 సంగిరెడ్డి చిన్న వెంకట సుబ్బారెడ్డి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఇక వైసీపీ అభ్యర్థులు యర్రగుంట్ల-1 అయ్యలూరి అక్తర్‌ బాషా, శిరివెళ్ల-1 టంబ అబ్దుల్లా, బోయలకుంట్ల-బీరోలి అబ్దుల్‌ ఖయ్యుం, గంగవరంలో దూదేకుల శంకరమ్మ, గుంప్రమాన్‌దిన్నెలో పడమటి హేమలత గెలుపొందారు. గోవిందపల్లె-2 ఎంపీటీసీగా అవుకు భారతి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.

ంపీపీగా మేరువ శాంతి :

మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో ఎంపీపీ పదవిని టీడీపీ చేజిక్కిచ్చుకుంది. అన్‌రిజర్వుడ్‌ మహిళకు కేటాయించడంతో కామినేనిపల్లెకు చెందిన మేరువ శాంతి యర్రగుంట్ల-2 ఎంపీటీసీగా గెలవడంతో ఆమెను ఎన్నుకోనున్నట్లు సమాచారం.

24,487 ఓట్లతో కాటంరెడ్డి గెలుపు

శిరివెళ్ల: జడ్పీటీసీ సభ్యుడిగా కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి 24,487 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 34,378 ఓట్లు పోల్‌కాగా టీడీపీ అభ్యర్థికి 28,959 ఓట్లు, వైసీపీ అభ్యర్థి మందాల శివారెడ్డికి 4,472 ఓట్లు, జనసేన అభ్యర్థి పెసరాయి చాంద్‌బాషాకు 478 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి మందుల రామకృష్ణకు 275 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి నరేంద్రకు 200 ఓట్లు వచ్చాయి.

ఉయ్యాలవాడలో టీడీపీ-6 ఎంపీటీసీలు, వైసీపీ-2

- జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం

ఉయ్యాలవాడ: 8 ఎంపీటీలకు గాను ఇద్దరు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహిచంగా, టీడీపీ3 వైసీపీ-2,జనసేన 1 గెలిచాయి. అల్లూరు ఎంపీటీసీగా కర్రా రమే్‌షరెడ్డి(టీడీపీ) ఎకగ్రీవం, బోడెమ్మనూరు-గోపిరెడ్డి హరిప్రసాద్‌రెడ్డి(టీడీపీ) ఏకగ్రీవం, మాయలూరు-మరియమ్మ(టీడీపీ), ఆర్‌.జంబులదిన్నె-బాలనరసింహుడు(టీడీపీ), ఆర్‌.పాంపల్లె-గొంతుల పార్వతి(టీడీపీ), ఉయ్యాలవాడ-ఆకుల జయమ్మ(జనసేన), హరివరం మద్దూరి-పుల్లక్క(వైసీపీ), పెద్దయమ్మనూరు తలారి వెంకటరాముడు(వైసీపీ) విజయం సాధించారు. ఉయ్యాలవాడ జడ్పీటీసీగా పేరెడ్డి స్వరూపరాణి(టీడీపీ) విజయం సాధించారు.

రుద్రవరంలో టీడీపీ-7, వైసీపీ-6, జనసేన-1

రుద్రవరం: ఎంపీటీసీ స్థానాలు 14 ఉండగా 7 టీడీపీ, 6 వైసీపీ. 1జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. పెద్దకంబలూరు ఎంపీటీసీగా ఎర్రం మౌనిక, చ్నిన్నకంబలూరు- యడవలి లక్ష్మిదేవి, రుద్రవరం-2 జి.మంగమ్మ, చిత్తరేణిపల్లె-డి.దస్తగిరమ్మ, నాగులవరం-జి.లక్ష్మిదేవి, మందలూరు-ఎం.పరిమళ, కోటకొండ-టి.రవికుమార్‌ టీడీపీ తరపున విజయం సాధించారు. అలాగే రుద్రవరం -1 మహబ్బీ, పేరూరు-ఎ్‌స.సావిత్రమ్మ, యల్లావత్తుల-విజయలక్ష్మి, ఎర్రగుడిదిన్నె-ఎం.రవికుమార్‌, నరసాపురం-ఎ్‌స.ప్రసాద్‌, ఆలమూరు-ఎం.నజీర్‌ వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ముత్తలూరు-వై.లక్ష్మినారాయణరెడ్డి జనసేన అభ్యర్ధిగా విజయం సాధించారు.

రుద్రవరం జడ్పీటీసీగా ఫక్కీరన్న

జడ్పీటీసీగా గుర్రం పెద్ద ఫక్కీరన్న 16258 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం ఓట్లు 20,595 నమోదు కాగా, వైసీపీకి 4337, సీపీఐకి 1302, నోటాకు 116. చెల్లనివి 552 నమొదయ్యాయి.

దొర్నిపాడు జడ్పీటీసీగా పార్వతి

ఎంపీటీసీలు టీడీపీ-5, వైసీపీ-2

దొర్నిపాడు: జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి కేదాటి పార్వతి 9,686 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 7 ఎంపీటీసీ స్థానాల్లో దొర్నిపాడు అశోక్‌ కుమార్‌ యాదవ్‌, రామచంద్రాపురం-సుష్మిత, క్రిష్టిపాడు-గడ్డం పుల్లయ్య, గుండుపాపల-కేడం మెర్సీ, డబ్ల్యూ.గోవిందిన్నె-నందగారి సరస్వతి టీడీపీ తరపున గెలిచారు. చాకరాజవేముల-పుల్లయ్య, అమ్మిరెడ్డి నగరం-చిన్న హుసేనయ్య వైసీపీ తరపున గెలిచినట్లు ఆర్వో నాగరాజు, ఎంపీడీవో సావిత్రి తెలిపారు.

ఏకగ్రీవమైన జడ్పీటీసీ స్థానాలు

బనగానపల్లె-బురానుద్దీన్‌ (టీడీపీ)

బేతంచెర్ల-పోలూరు రాఘవరెడ్డి (టీడీపీ)

సంజామల-బెలుం వరలక్ష్మి (టీడీపీ)

కోవెలకుంట్ల-గడ్డం నారాయణమ్మ (టీడీపీ)

కొలిమిగుండ్ల-నంద్యాల రమాదేవి (టీడీపీ)త

అవుకు-చల్లా విజయభాస్కర రెడ్డి (టీడీపీ)

ప్యాపిలి-కృష్ణమూర్తి వైసీపీ

బనగానపల్లె నియోజకవర్గలో 85 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 84 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో టీడీపీ-54, వైసీపీ-28, బీజేపీ-1, జనసేన-1 దక్కించుకున్నాయి.

Updated Date - Nov 08 , 2026 | 12:39 AM