ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..
ABN , Publish Date - Nov 07 , 2026 | 07:13 PM
బొండపల్లి పరిషత్ ఎన్నికల్లో సామాన్య మహిళగా ఎన్నికల బరిలో నిలిచిన పాశల నీరజ ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషపై ఏకంగా 5,136 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఇంటర్నెట్ డెస్క్: బొండపల్లి పరిషత్ ఎన్నికల్లో సామాన్య మహిళగా ఎన్నికల బరిలో నిలిచిన పాశల నీరజ ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషపై ఏకంగా 5,136 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో బొండపల్లిలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ విజయం వెనుక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం కీలకంగా నిలిచింది (Bondapalli Election Results).
రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అనూషపై సాధారణ మహిళగా బరిలోకి దిగిన నీరజ విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 5,136 ఓట్ల మెజారిటీ సాధించడం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బొండపల్లి ప్రజలు రాజకీయ పలుకుబడి కంటే సామాన్య మహిళకు ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.
బొండపల్లిలో పాశల నీరజ విజయానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) అనుసరించిన ఎన్నికల వ్యూహం కీలకంగా మారిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా నిర్వహించడం, పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడం, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం ద్వారా విజయానికి బాటలు వేశారు. భారీ సభలు, ఆర్భాటపు ప్రచారాల కంటే ప్రజలతో నేరుగా మమేకం కావడమే నీరజకు కలిసొచ్చిందని టీడీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..
అమెరికా దాడుల భయం.. ఇరాన్‌లో అయోడిన్ మాత్రలు పంచుతున్నారా..