Share News

శ్రీలంక ప్లేయర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు

ABN , Publish Date - Aug 24 , 2026 | 04:35 PM

భారత బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో చోటు చేసుకున్న వాగ్వాదంపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది.

శ్రీలంక ప్లేయర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు
Yashasvi Jaiswal

ఇంటర్నెట్ డెస్క్: భారత బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో చోటు చేసుకున్న వాగ్వాదంపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఇద్దరు ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంతేకాకుండా ఇద్దరి ఖాతాల్లోనూ ఒక్కో డీమెరిట్‌ పాయింట్‌ జత చేసింది. ఇద్దరూ ఐసీసీ ప్లేయర్స్‌ అండ్‌ ప్లేయర్‌ సపోర్ట్‌ పర్సనల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.12ను ఉల్లంఘించినట్లు ఐసీసీ వెల్లడించింది.


అసలేం జరిగిందంటే?

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌లో అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో జైస్వాల్‌ ఔటయ్యాడు. అనంతరం జైస్వాల్‌ పెవిలియన్‌కు వెళ్తుండగా.. ఫెర్నాండో ఏవో వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన యశస్వి.. ఫెర్నాండోతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో తలకు తగిలింది. పరిస్థితి చేయిదాటిపోయేలా ఉండటంతో లంక కెప్టెన్ ధనంజయ డిసెల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్‌తో పాటు ఇతర ప్లేయర్లు, అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ దూరంగా తీసుకెళ్లారు. దీంతో గొడవ సద్దుమణిగింది. కాగా ఇద్దరూ తమ తప్పును అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా ఐసీసీ శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ ఇద్దరి పైగా సంవత్సరం కాలంగా ఎలాంటి పనిష్‌మెంట్లు లేకపోవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

పడిక్కల్‌ను పక్కన పెట్టలేరు.. ఇక్కడ కోచ్‌గా గంభీర్‌కు పెద్దగా పని లేదు: క్రిస్ శ్రీకాంత్

బాలికపై లైంగిక వేధింపులు.. ద్రోణాచార్య అవార్డు గ్రహీతపై పోక్సో కేసు

Updated Date - Aug 24 , 2026 | 04:35 PM