Share News

పడిక్కల్‌ను పక్కన పెట్టలేరు.. ఇక్కడ కోచ్‌గా గంభీర్‌కు పెద్దగా పని లేదు: క్రిస్ శ్రీకాంత్

ABN , Publish Date - Aug 24 , 2026 | 03:25 PM

టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్.. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో కొనసాగించాలని గంభీర్ గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక పడిక్కల్‌ను భవిష్యత్తులో పక్కన పెట్టలేరని తెలిపాడు.

పడిక్కల్‌ను పక్కన పెట్టలేరు.. ఇక్కడ కోచ్‌గా గంభీర్‌కు పెద్దగా పని లేదు: క్రిస్ శ్రీకాంత్
Kris Srikkanth

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మరోసారి అదరగొట్టాడు. తొలి టెస్టులో అద్భుత శతకంతో ఆకట్టుకున్న అతడు.. రెండో టెస్టులోనూ 117 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. గాయంతో సాయి సుదర్శన్ దూరం కావడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న పడిక్కల్.. వరుస సెంచరీలతో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్.. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో కొనసాగించాలని గంభీర్ గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక పడిక్కల్‌ను భవిష్యత్తులో పక్కన పెట్టలేరని తెలిపాడు.


‘తొలి టెస్టులోనే 200కు పైగా పరుగులు చేసిన పడిక్కల్‌ను భవిష్యత్తులో ఎలా పక్కన పెడతారు? గంభీర్ ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. శ్రీలంక, అఫ్గానిస్థాన్ లాంటి జట్లపై గెలిచిన తర్వాత మాత్రమే చాలా ఎక్కువగా మాట్లాడతాడు. శ్రీలంకతో సిరీస్‌లో కోచ్‌గా గంభీర్‌కు పెద్దగా పని లేదు. ఎందుకంటే లంక జట్టు అంత గొప్పగా ప్రదర్శన చేయడం లేదు. కాబట్టి సిరీస్‌ను టీమిండియానే గెలుచుకుంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే గంభీర్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం నా ఉద్దేశం కాదు. అతడు మంచి ప్లేయర్. ఆటను బాగా అర్థం చేసుకోగలడు. కానీ గంభీర్ ఆటగాళ్లతో మరింత కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది’ అని క్రిస్ శ్రీకాంత్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

శ్రీలంకతో టెస్టులో రిషబ్ పంత్ అరుదైన ఘనత

ఓడినప్పటికీ చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌలర్

Updated Date - Aug 24 , 2026 | 03:25 PM