Share News

మహిళల ఆసియా కప్: షఫాలీ, స్మృతి హాఫ్ సెంచరీలు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Sep 13 , 2026 | 09:43 PM

దుబాయ్ వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరులో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేశారు. శ్రీలంకకు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

మహిళల ఆసియా కప్: షఫాలీ, స్మృతి హాఫ్ సెంచరీలు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
Women's Asia Cup Final

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరులో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేశారు. శ్రీలంకకు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓపెనర్లు స్మృతి మంధాన(59), షఫాలీ వర్మ(68) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


కెప్టెన్ హర్మన్ ప్రీత్(14), రిచా ఘోష్(17), దీప్తి శర్మ(5) పరుగులు చేశారు. భార్తీ ఫుల్మాలి(2*), కమిలిని(15*) నాటౌట్‌గా నిలిచారు. ఆఖరి రెండు బంతులకు కమిలిని ఒక సిక్సర్, ఫోర్ బాదడం విశేషం. శ్రీలంక బౌలర్లలో మిథాలీ అయోధ్య, చమరి ఆటపట్టు, ప్రబోధ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్‌

ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం

Updated Date - Sep 13 , 2026 | 09:43 PM