Share News

ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం

ABN , Publish Date - Sep 13 , 2026 | 04:59 PM

భారత మహిళల జూనియర్ హాకీ జట్టు అదరగొట్టింది. జూనియర్ ఆసియా కప్‌లో వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య చైనాను 1-0తో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది.

ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం
India Women Junior Hockey Team

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల జూనియర్ హాకీ జట్టు అదరగొట్టింది. జూనియర్ ఆసియా కప్‌లో వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య చైనాను 1-0తో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. సానికా చంద్రకాంత్ మానే 17వ నిమిషంలో చేసిన ఏకైక గోల్‌ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఈ విజయంతో భారత్ ఎఫ్‌ఐహెచ్ జూనియర్ వరల్డ్ కప్‌కు కూడా అర్హత సాధించింది.


సానికా గోల్‌తో ఆధిక్యం

భారత్, చైనా మధ్య ఫైనల్ హోరాహోరీగా సాగింది. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లూ గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌లో 17వ నిమిషంలో సానికా మానే అద్భుతంగా గోల్ చేసి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత చైనా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా భారత అమ్మాయిలు డిఫెన్స్‌లో ఏమాత్రం తడబడలేదు. మూడో క్వార్టర్‌లోనూ ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్.. చివరి క్వార్టర్‌లోనూ ఆతిథ్య జట్టుకు అవకాశం ఇవ్వలేదు. చివరి విజిల్ వరకు పట్టుదలగా పోరాడి 1-0 విజయాన్ని అందుకుంది.


ప్లేయర్లకు నజరానా

జూనియర్ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకున్న భారత మహిళల జట్టుకు హాకీ ఇండియా నగదు బహుమతిని ప్రకటించింది. ప్రతి ప్లేయర్‌కు రూ.3 లక్షలు, సహాయక సిబ్బందిలో ఒక్కొక్కరికి రూ.1.5 లక్షలు అందించనున్నట్లు వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

ఎవరికీ చెడు చేయాలని అనుకోను.. భావోద్వేగానికి గురైన స్మృతి మంధాన

హ్యాట్రిక్ మిస్.. రాకెట్‌ను నేలకేసి కొట్టిన సబలెంకా.. వీడియో వైరల్

Updated Date - Sep 13 , 2026 | 04:59 PM