పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్
ABN , Publish Date - Sep 13 , 2026 | 06:22 PM
పురుషుల జూనియర్ ఆసియా కప్‌లో భారత్ వరుసగా నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో దక్షిణ కొరియాపై 4-1తో ఘన విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత జూనియర్ హాకీ జట్టు మరోసారి ఆసియాలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పురుషుల జూనియర్ ఆసియా కప్‌లో భారత్ వరుసగా నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో దక్షిణ కొరియాపై 4-1తో ఘన విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ టోర్నీలో వరుసగా నాలుగుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. మొత్తంగా ఇది భారత్‌కు ఆరో జూనియర్ ఆసియా కప్ టైటిల్ కావడం విశేషం. ఇదిలా ఉంటే, ఇంతకు ముందే హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్‌నూ భారత జట్టే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆరంభం నుంచే ఆధిపత్యం
ఫైనల్లో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అజీత్ యాదవ్ తొమ్మిదో నిమిషంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్లు అదే జోరును కొనసాగించారు. అన్మోల్, ప్రభుదీప్ సింగ్ చెరో గోల్ చేశారు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచి టైటిల్‌కు మరింత చేరువైంది. చివరి క్వార్టర్‌లో ఆశు మౌర్య పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 4-0కు పెంచాడు. దక్షిణ కొరియా చివర్లో ఒక గోల్ సాధించినా.. అప్పటికే మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరకు 4-1తో విజయం సాధించిన భారత జట్టు ఆసియా కప్‌ను ముద్దాడింది.
ఇవి కూడా చదవండి:
ఎవరికీ చెడు చేయాలని అనుకోను.. భావోద్వేగానికి గురైన స్మృతి మంధాన
హ్యాట్రిక్ మిస్.. రాకెట్‌ను నేలకేసి కొట్టిన సబలెంకా.. వీడియో వైరల్