మహిళల ఆసియా కప్ ఫైనల్: టాస్ నెగ్గిన టీమిండియా.. శ్రీలంక బౌలింగ్
ABN , Publish Date - Sep 13 , 2026 | 07:41 PM
మహిళల ఆసియా కప్ తుది అంకానికి చేరింది. దుబాయ్ వేదికగా శ్రీలంక-భారత్ జట్లు ఫైనల్ పోరులో మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఆసియా కప్ తుది అంకానికి చేరింది. దుబాయ్ వేదికగా శ్రీలంక-భారత్ జట్లు ఫైనల్ పోరులో మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక తొలుత ఫీల్డింగ్ చేయనుంది. రికార్డు స్థాయిలో ఏడుసార్లు ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న భారత మహిళా జట్టు.. ఆ కప్పుల ఖజానాలోకి ఇంకో ట్రోఫీ చేర్చాలనే పట్టుదలతో ఉంది. గ్రూప్ స్టేజ్‌లో మూడుకు మూడు విజయాలతో ఫైనల్ చేరిన భారత్.. బలమైన శ్రీలంకపై ఆధిపత్యం చెలాయిస్తుందో? లేదో? చూడాలి.
భారత మహిళల తుది జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, భార్తీ ఫుల్మాలీ, రిచా ఘోష్(వికెట్ కీపర్), కమలినీ, దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మ
శ్రీలంక మహిళల తుది జట్టు:
చమరి ఆటపట్టు(కెప్టెన్), ఇమేషా దులానీ, విష్మి గుణరత్నే, హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలక్షిక సిల్వ, కౌశిని న్యూత్యాంగన (వికెట్‌కీపర్), సుగందిక కుమారి, చాముడి ప్రభోద, మిథాలీ అయోధ్య
ఇవి కూడా చదవండి:
ఎవరికీ చెడు చేయాలని అనుకోను.. భావోద్వేగానికి గురైన స్మృతి మంధాన
హ్యాట్రిక్ మిస్.. రాకెట్‌ను నేలకేసి కొట్టిన సబలెంకా.. వీడియో వైరల్