అఫ్గాన్‌తో తొలి టీ20: టాస్ నెగ్గిన భారత్.. వైభవ్‌కు నో ఛాన్స్
ABN , Publish Date - Sep 13 , 2026 | 07:14 PM
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? అనే ఉత్కంఠకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెరదించాడు. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో తొలి టీ20లో వైభవ్ ఆడటం లేదని స్పష్టమైంది. మరోవైపు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చోటు దక్కించుకోలేదు.
భారత తుది జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి
అఫ్గాన్ తుది జట్టు:
ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, డార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నబి, మహ్మద్ నబి, రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, ఫరూఖీ
ఇవి కూడా చదవండి:
ఎవరికీ చెడు చేయాలని అనుకోను.. భావోద్వేగానికి గురైన స్మృతి మంధాన
హ్యాట్రిక్ మిస్.. రాకెట్‌ను నేలకేసి కొట్టిన సబలెంకా.. వీడియో వైరల్