Share News

అఫ్గాన్‌తో తొలి టీ20: ఆదుకున్న అజ్మతుల్లా.. భారత్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Sep 13 , 2026 | 09:22 PM

అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్-భారత జట్లు తొలి టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

అఫ్గాన్‌తో తొలి టీ20: ఆదుకున్న అజ్మతుల్లా.. భారత్ టార్గెట్ ఎంతంటే?
India vs Afghanistan 1st T20

ఇంటర్నెట్ డెస్క్: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్-భారత జట్లు తొలి టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. భారత్‌కు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన అఫ్గాన్ జట్టును.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆదుకున్నాడు. 44 బంతుల్లో 64 పరుగులతో రాణించాడు.


మరో బ్యాటర్ మహ్మద్ నబీ(33) పర్వాలేదనిపించాడు. నబీతో కలిసి ఒమర్జాయ్ ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించాడు. రహ్మానుల్లా(0), జద్రాన్(11), సెదిఖుల్లా(13), గుల్బాదిన్(2), రసూలీ(2), రషీద్ ఖాన్(1), నూర్ అహ్మద్(0) తీవ్రంగా నిరాశపర్చారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్‌

ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం

Updated Date - Sep 13 , 2026 | 09:22 PM