Share News

వరల్డ్ కప్2026లో ఇంగ్లండ్ శుభారంభం.. శ్రీలంకపై సూపర్ విక్టరీ

ABN , Publish Date - Jun 13 , 2026 | 07:35 AM

మహిళా టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో గెలిచింది.

వరల్డ్ కప్2026లో ఇంగ్లండ్ శుభారంభం.. శ్రీలంకపై సూపర్ విక్టరీ
England vs Sri Lanka

స్పోర్ట్స్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.


ఇంగ్లండ్ బ్యాటర్లలో వ్యాట్‌ హాట్జ్‌ (62 బంతుల్లో 105 పరుగులు) మెరుపు సెంచరీతో విధ్వంసం సృష్టించింది. ఆమెకు తోడు అమీ జోన్స్‌ (53), నాట్‌ సీవర్‌ (46*) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. దీంతో ఇంగ్లండ్ 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 220 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 132 పరుగులకు కుప్పకూలింది. ఆ జట్టులో నీలక్షిక సిల్వా (39) టాప్‌ స్కోరర్‌ నిలిచింది.


హర్షిత సమరవిక్రమ 29 పరుగులు చేసింది. లంక జట్టులో ఇద్దరు డకౌట్‌ కాగా, మొత్తం ఐదుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ప్రేయ కెంప్‌ 4 వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించింది. వ్యాట్‌ హాట్జ్‌ ప్లేయర్ 'ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది. ఇంగ్లండ్ జూన్ 16న ఐర్లాండ్‌తో తలపడనుండగా.. అదే రోజు శ్రీలంక.. న్యూజిలాండ్‌తో ఆడనుంది.


ఇవి కూడా చదవండి:

దిగ్గజ షూటర్‌ జస్పాల్‌ రాణా హఠాన్మరణం

వన్డే వరల్డ్‌కప్‌ లక్ష్యంగా..

Updated Date - Jun 13 , 2026 | 07:40 AM