Share News

వచ్చే వారమే నివేదిక

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:27 AM

క్రైస్తవం, ఇస్లాం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ గుర్తింపు లభిస్తుందా? లేదా? అన్న కీలక అంశంపై అధ్యయనానికి ఏర్పాటైన జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ కమిషన్‌ తన నివేదికపై...

వచ్చే వారమే నివేదిక

  • జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ వెల్లడి

  • క్రైస్తవం, ఇస్లాంలలోకి మారిన దళితులకు ఎస్సీ గుర్తింపు ఇచ్చే అంశంపై కమిషన్‌ అధ్యయనం

న్యూఢిల్లీ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): క్రైస్తవం, ఇస్లాం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ గుర్తింపు లభిస్తుందా? లేదా? అన్న కీలక అంశంపై అధ్యయనానికి ఏర్పాటైన జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ కమిషన్‌ తన నివేదికపై తుది కసరత్తు జరుపుతోంది. మరో వారం రోజుల్లో నివేదిక పూర్తవుతుందని జస్టిస్‌ బాలకృష్ణన్‌.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి శుక్రవారం తెలియజేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిషన్‌ను కేంద్రప్రభుత్వం 2022 అక్టోబరులో ఏర్పాటు చేసింది. ఎస్సీ గుర్తింపునకు సంబంధించి 1950 నాటి ‘రాజ్యాంగ (షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌) ఆదేశం’ మార్గదర్శకాల మేరకు ఈ అంశాన్ని పరిశీలించాలని కమిషన్‌కు ప్రభుత్వం విధివిధానాలను నిర్ణయించింది. ప్రస్తుతం హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని దళితులకే ఎస్సీ హోదా లభిస్తోంది. ఎస్టీలకు ఏ మతంలో ఉన్నా ఎస్టీలుగానే గుర్తింపు దక్కుతోంది. క్రైస్తవం, ఇస్లాంలోకి మారిన దళితులకు కూడా ఎస్సీ గుర్తింపు ఇవ్వాలని చాలాకాలంగా ఆయా వర్గాల నుంచి డిమాండ్‌ ఉంది.దీన్ని పరిశీలించాలని ప్రభుత్వం జస్టిస్‌ బాలకృష్ణన్‌ కమిషన్‌ను నియమించింది. కమిషన్‌కు ఇచ్చిన రెండేళ్ల గడువు 2024లో ముగిసినప్పటికీ.. కేంద్రం గడువును పలుమార్లు పొడిగించింది. తాజా గడువు ఈ నెల 10తో ముగిసింది. మరోవైపు దళిత క్రైస్తవులు, ముస్లింలకు ఎస్సీ గుర్తింపు అంశం సుప్రీంకోర్టు ఎదుట గత 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక క్రైస్తవ పాస్టర్‌ ఎస్సీ గుర్తింపును సుప్రీంకోర్టు రద్దు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 06:27 AM