Share News

వన్డే వరల్డ్‌కప్‌ లక్ష్యంగా..

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:50 AM

అఫ్ఘానిస్థాన్‌తో జరుగబోయే మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీ్‌సతో టీమిండియా తమ వరల్డ్‌కప్‌ సన్నాహకాలను ఆరంభించనుంది. శనివారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరుగనున్నాయి...

వన్డే వరల్డ్‌కప్‌ లక్ష్యంగా..

భారత్‌ సన్నాహకాలు జూనేటి నుంచి అఫ్ఘాన్‌తో మూడు వన్డేల సిరీస్‌

మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

ధర్మశాల: అఫ్ఘానిస్థాన్‌తో జరుగబోయే మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీ్‌సతో టీమిండియా తమ వరల్డ్‌కప్‌ సన్నాహకాలను ఆరంభించనుంది. శనివారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌కు ధర్మశాల వేదిక కానుంది. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నె్‌సతో పాటు అతడి ఆటతీరు ఈ సిరీ్‌సలో కీలకం కానుంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. వచ్చే ఏడాది అక్టోబరులో జరిగే వన్డే ప్రపంచకప్‌ ఈ ఇద్దరు వెటరన్స్‌కు చివరిదనే అంచనాలో ఉన్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు జట్టు 25 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో ప్రయోగాలతో పాటు జట్టు కాంబినేషన్‌ ఎలా ఉండాలనే విషయమై టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తగినంత సమయం ఉండనుంది. అయితే గిల్‌ కెప్టెన్సీలో ఆడిన మూడు సిరీ్‌సల్లో జట్టు రెండింట్లో ఓడడం గమనార్హం. అటు అఫ్ఘాన్‌ ఏకైక టెస్టులో చిత్తుగా ఓడినా.. తామాడిన చివరి నాలుగు వన్డేల్లో గెలిచింది. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, వెటరన్‌ నబీ రాకతో బలం పెరిగింది. శనివారం మధ్యాహ్నం చిరుజల్లులకు ఆస్కారం ఉండడంతో మ్యాచ్‌ ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశం ఉంది.

విరాట్‌ స్థానంలో ఇషాన్‌?

గిల్‌, రోహిత్‌ ఓపెనర్లుగా రానుండగా.. విరాట్‌ లేకపోవడంతో వన్‌డౌన్‌లో ఇషాన్‌, జైస్వాల్‌ మధ్య పోటీ నెలకొంది. జైస్వాల్‌ కెరీర్‌లో నాలుగు వన్డేలు మాత్రమే ఆడగా వన్‌డౌన్‌లో ఒక్కసారి కూడా బరిలోకి దిగలేదు. ఇక నూతన టీ20 కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ నాలుగో నెంబర్‌లో బరిలోకి దిగనున్నాడు. మిడిలార్డర్‌లో రాహుల్‌, నితీశ్‌ కుమార్‌, సుందర్‌ అండగా ఉంటారు. హార్దిక్‌కు బ్యాక్‌పగా భావిస్తున్న నితీశ్‌ ఆల్‌రౌండ్‌షోపై అంచనాలున్నాయి. అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌లకు తోడు ప్రిన్స్‌ యాదవ్‌, గుర్నూర్‌ బ్రార్‌లలో ఒకరు అరంగేట్రం చేయవచ్చు. బుమ్రా, సిరాజ్‌లకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.

తుది జట్లు (అంచనా)

భారత్‌: గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌, ఇషాన్‌, శ్రేయాస్‌, రాహుల్‌, నితీశ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌, ప్రిన్స్‌ యాదవ్‌/గుర్నూర్‌.

అఫ్ఘానిస్థాన్‌: జద్రాన్‌, గుర్బాజ్‌, అటల్‌, రహ్మత్‌ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), ఒమర్జాయ్‌, అలిఖిల్‌, నబీ, రషీద్‌ ఖాన్‌, సలీమ్‌, ఘజన్‌ఫర్‌, జియావుర్‌ రహ్మాన్‌.

ఇవి కూడా చదవండి:

సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్

అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు

Updated Date - Jun 13 , 2026 | 01:50 AM