Share News

సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:42 PM

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే వైభవ్‌లోనే ఎక్కువ సత్తా ఉందని తెలిపాడు.

సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్
Dale Steyn

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే వైభవ్‌లోనే ఎక్కువ సత్తా ఉందని తెలిపాడు. అతడు భారత క్రికెట్‌కు ఖజానా లాంటివాడని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026లో కేవలం 15 ఏళ్ల వయసులోనే 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం భారత టీ20 జట్టులో చోటు సంపాదించాడు. అతడి అద్భుత ప్రదర్శనలపై మాట్లాడిన స్టెయిన్.. వైభవ్‌ను ప్రత్యేక ప్రతిభావంతుడిగా అభివర్ణించాడు.


‘సచిన్, కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్ల గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ వారిద్దరి కంటే వైభవ్‌లో చాలా సత్తా ఉందని అనిపిస్తోంది. అతడి కెరీర్ ముగిసే సమయానికి వైభవ్ ఎంత పెద్ద ఆటగాడిగా నిలుస్తాడో ఊహించడం కూడా కష్టం. మా దేశంలో ప్రతిభకు కొదవలేదు. అండర్-19, అండర్-15 స్థాయిలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వైభవ్ మాత్రం వారందరి కంటే ప్రత్యేకం. ప్రస్తుతం చాలామంది అంతర్జాతీయ క్రికెటర్ల కంటే కూడా మెరుగ్గా కనిపిస్తున్నాడు. భారత క్రికెట్‌కు అతడు ఓ ఖజానా’ అని స్టెయిన్ తెలిపాడు.


సరైన మార్గంలో నడిపించాలి..

‘ప్రస్తుతం వైభవ్ వయసు 15 ఏళ్లే. అతడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌పై ఉ:ది. ఒకవేళ అతడి ఆటను కోల్పోతే టీమిండియాకు చాలా నష్టమవుతుంది. బంతిని చాలా బాగా ఆడతాడు. భారత్‌లో అతడి ఆటను దగ్గర్నుంచి చూశా. రబాడా ఒక్కడే వైభవ్‌ను కాస్త కట్టడి చేయగలిగాడు. మిగతా ప్రపంచ మేటి బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటర్‌కు ఒక్కసారి భయపడ్డామంటే బౌలింగ్ చేయడం కష్టమవుతుంది. వైభవ్‌ను షార్ట్ బంతులతో మాత్రమే అడ్డుకునేందుకు అవకాశం ఉంది’ అని స్టెయిన్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ప్రైవేట్ జెట్‌లో క్రికెట్ ఆడిన సచిన్.. వీడియో వైరల్

వన్డే ప్రపంచ కప్ 2027: షెడ్యూల్ ఖరారు!

Updated Date - Jun 12 , 2026 | 06:55 PM