Share News

నీట్‌ రీఎగ్జామ్‌కు పారామిలిటరీ భద్రత!

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:30 AM

లీకేజీలు, అక్రమాల వివాదంతో రద్దయిన నీట్‌-2026 పరీక్షను తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక పోలీసులతోపాటు పారామిలిటరీ బలగాలతో...

నీట్‌ రీఎగ్జామ్‌కు పారామిలిటరీ భద్రత!

  • హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ నుంచి 551 నగరాలకు ప్రశ్నపత్రాలు

న్యూఢిల్లీ, జూన్‌ 12: లీకేజీలు, అక్రమాల వివాదంతో రద్దయిన నీట్‌-2026 పరీక్షను తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక పోలీసులతోపాటు పారామిలిటరీ బలగాలతో భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌లలో ఉన్న ప్రధాన కేంద్రాల నుంచి నీట్‌ ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్‌ జవాబు పత్రాలను దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు అక్కడి నుంచి పరీక్ష జరిగే పట్టణాలు, కేంద్రాలకు తరలించనున్నారు. సీఆర్‌పీఎఫ్‌, సీఐఎ్‌సఎఫ్‌ పారా మిలిటరీ బలగాల భద్రత మధ్య రోడ్డు మార్గంలో, అవసరమైన చోట విమానాలు, హెలికాప్టర్లలో ఈ తరలింపు ప్రక్రియ జరగనుందని ‘జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ)’ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, నీట్‌ పరీక్ష సమయాన్ని ఎన్‌టీఏ 15 నిమిషాలు పొడిగించింది. గతంలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5వరకు పరీక్ష నిర్వహించగా.. ఈసారి సాయంత్రం 5.15 నిమిషాల వరకు సమయం ఇవ్వనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 06:30 AM