దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా హఠాన్మరణం
ABN , Publish Date - Jun 13 , 2026 | 01:54 AM
భారత క్రీడారంగంలో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా (49) మృతి చెందాడు. జర్మనీలోని మ్యూనిచ్‌లో ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌కప్ పోటీలను ముగించుకుని...
దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా హఠాన్మరణం
మను బాకర్ కోచ్‌గా ఖ్యాతి
న్యూఢిల్లీ: భారత క్రీడారంగంలో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా (49) మృతి చెందాడు. జర్మనీలోని మ్యూనిచ్‌లో ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌కప్ పోటీలను ముగించుకుని భారత బృందం తిరిగి వస్తుండగా రాణా విమానంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఢిల్లీకి చేరిన వెంటనే నేరుగా ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడి వైద్యులు గుండె రక్తనాళంలో అడ్డంకిని గుర్తించి స్టెంట్‌ను అమర్చారు. కొద్ది రోజుల తర్వాత మరో స్టెంట్ ప్రక్రియ కూడా చేపట్టాల్సి ఉంటుందని భావించారు. ఇక రాణా పరిస్థితి నిలకడగానే ఉందని మొదట వార్తలు వినిపించినా.. గురువారం రాత్రి జస్పాల్ తుది శ్వాస విడిచినట్టు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కలికేశ్ నారాయణ్ సింగ్‌దేవ్ తెలిపారు. అయితే ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌కప్ సమయంలోనే రాణాకు ఛాతీలో నొప్పి వచ్చిందని, కానీ దాన్ని అజీర్తి సమస్యగా భావించాడని సోదరుడు సుభాష్ రాణా పేర్కొన్నాడు. గతేడాది ఫిబ్రవరిలో జాతీయ కోచ్‌గా నియమితులైన రాణా.. 25మీ. పిస్టల్ విభాగంలో హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గానూ బాధ్యతలు తీసుకున్నాడు.
షాక్‌లో మను
జస్పాల్ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని షూటర్ మనూ భాకర్ తల్లి సుమేధ అన్నారు. మను ప్రస్తుతం పూర్తి షాక్‌లో ఉన్నదని, కోచ్ మృతిపై స్పందించే స్థితిలో లేదని తెలిపారు. మను ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతున్న శిక్షణ శిబిరంలో ఉందని, తాను కూడా అక్కడే ఉన్నట్టు ఆమె చెప్పారు.

అథ్లెట్.. కోచ్‌గా
జస్పాల్ తన కెరీర్‌లో అత్యుత్తమ పిస్టల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఉత్తరాఖండ్‌లో జన్మించిన తను 1994లో అంతర్జాతీయ పోటీల్లో అరంగేట్రం చేశాడు. మొదట 1994 హిరోషిమా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం, కాంస్యం సాధించగా.. ఆ తర్వాత 2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు, ఓ రజతంతో వార్తల్లో నిలిచాడు. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో 1994 నుంచి 2006 వరకు 9 స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. 18 ఏళ్ల వయస్సులోనే అర్జున అవార్డు అందుకున్న రాణాకు మరో మూడేళ్లకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. ఇక షూటర్‌గా ఎదిగిన మనూ బాకర్ విజయాల వెనుక ఉన్నది జస్పాల్ కావడం విశేషం. అతడి శిక్షణలోనే 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మను రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం రాణాను 2020లో ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డుతో గౌరవించింది.
జస్పాల్ మరణం భారత క్రీడా ప్రపంచానికి తీరని లోటు. షూటింగ్‌లో తన ప్రతిభతో దేశం గర్వపడేలా చేశాడు. అలాగే యువ షూటర్లను తీర్చిదిద్దడంలో ఆయన నిబద్ధత వెలకట్టలేనిది. రాణా కుటుంబం, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి.
ప్రధాని మోదీ
ఇవి కూడా చదవండి:
సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్
అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు