బుమ్రా స్థానంలో నబీ.. షమీని ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా!
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:45 PM
భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ.. దేశవాళీలో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయినా జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు అందడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ.. దేశవాళీలో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయినా జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు అందడం లేదు. తాజాగా స్టార్ పేసర్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో షమీని కాకుండా.. యువ పేసర్ ఆకిబ్ నబీని బీసీసీఐ రిప్లేస్ చేసింది. దీనిపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. షమీని ఎందుకు ఎంపిక చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ షమీ భవిష్యత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మహ్మద్ షమీ చివరి సారిగా 2023లో భారత జట్టు తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత రంజీ ట్రోఫీలో వరుసగా ఆకట్టుకునే ప్రదర్శనలు చేసినప్పటికీ జాతీయ జట్టులోకి తిరిగి పిలుపు రాలేదు. ఈ విషయంపై అజిత్ అగార్కర్ స్పందించాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఫిట్‌నెస్ ప్రస్తుతం షమీకి లేదని స్పష్టం చేశాడు. అందుకే షమీని జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం లేదని తెలిపాడు. అయితే గత ఏడు రంజీ మ్యాచ్‌ల్లో షమీ 37 వికెట్లు తీసి మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అదే సీజన్‌లో ఆకిబ్ నబీ 60 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో శ్రీలంక టెస్టు సిరీస్‌కు అతడికి అవకాశం లభించింది.
ఆకిబ్ నబీ ఎంపికతో షమీకి బీసీసీఐ పంపిన సందేశం స్పష్టమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్టు జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ టోర్నీల్లో యువ పేసర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేయడమే కాకుండా పూర్తి ఫిట్‌నెస్‌ను కూడా నిరూపించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇకపై యువ పేసర్లు కేవలం జట్టులో సంఖ్యను పెంచడానికి కాకుండా, తుది జట్టులో చోటు కోసం నేరుగా సీనియర్లతో పోటీ పడుతున్న పరిస్థితి ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: భారత్ వైదొలిగితే.. యువ పేసర్లకు బీసీసీఐ ఛాన్స్!
ఆ ఒక్కసారే కేఎల్ రాహుల్ కోపంగా ఉండటం చూశా: వసీం జాఫర్