Share News

ఇంగ్లండ్ ప్లేయర్లతో ఘర్షణ.. ఎవరీ రగ్బీ ప్లేయర్?

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:41 PM

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు విజయం అనంతరం.. ఇంగ్లండ్ ప్లేయర్లు మద్యం తాగి ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ రగ్బీ ప్లేయర్ ఎవరా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

ఇంగ్లండ్ ప్లేయర్లతో ఘర్షణ.. ఎవరీ రగ్బీ ప్లేయర్?
Totova Auva

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ అట్కిన్సన్ నైట్ క్లబ్ వివాదం సంచలనంగా మారింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు విజయం అనంతరం.. ఇంగ్లండ్ ప్లేయర్లు మద్యం తాగి ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ).. జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు కివీస్‌తో జరగనున్న రెండో టెస్టుకు వీరిద్దరిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో వారితో గొడవకు దిగిన ఆ రగ్బీ ప్లేయర్ ఎవరా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.


స్టోక్స్, అట్కిన్సన్‌తో గొడవకు దిగిన రగ్బీ ఆటగాడు 21 ఏళ్ల టోటోవా ఔవా అని బ్రిటిష్ మీడియా వెల్లడించింది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 125 కిలోల బరువున్న ఔవా ప్రస్తుతం ఓ రగ్బీ అకాడమీ తరఫున ఆడుతున్నాడు. ఇంకా సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. ఇంగ్లండ్ ప్లేయర్లతో గొడవ అనంతరం టోటోవా ఓవర్‌నైట్‌లో వైరల్‌గా మారాడు.


నివేదికల ప్రకారం, టోటోవా ఔవాను కించపరిచే విధంగా స్టోక్స్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నైట్‌ క్లబ్‌లో జరిగిన ఈ వాగ్వాదం ఉద్రిక్తంగా మారడంతో ఔవా.. స్టోక్స్, అట్కిన్సన్ వైపు పంచ్ విసిరినట్లు తెలుస్తోంది. అయితే అది క్రికెటర్లకు కాకుండా ఇంగ్లండ్ ప్లేయర్ల భద్రతా సిబ్బందిలో ఒకరికి తగిలింది. ఈ ఘటనలో సదరు సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.


కాగా, లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆ మ్యాచ్‌లో అట్కిన్సన్ ఐదు వికెట్లు పడగొట్టగా, స్టోక్స్ కూడా ఒక వికెట్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు మైదానంలో ప్రదర్శన కంటే నైట్‌ క్లబ్ వివాదమే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ ఛాంపియన్‌గా నిలకవపోవడమే మంచిది: గుకేశ్

రిటైర్‌మెంట్ ఆలోచనలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్?

Updated Date - Jun 10 , 2026 | 03:20 PM