ఐపీఎల్ 2026: ఎక్కువగా మాట్లాడుకుంది ఈ ప్లేయర్ గురించే..
ABN , Publish Date - May 12 , 2026 | 08:44 PM
ఐపీఎల్ 2026లో అభిమానులు సోషల్ మీడియాలో ఏ క్రికెటర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారనే విషయాన్ని ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. మార్చి 28 నుంచి మే 12 వరకు ఉన్న డేటాను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించినట్లు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మే 24తో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు పూర్తవుతాయి. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం మ్యాచ్‌లన్నీ రసవత్తరంగా మారాయి. ఎనిమిది జట్లు ప్లే ఆఫ్స్ రేసులో ఉండగా.. ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌లో అభిమానులు సోషల్ మీడియాలో ఏ క్రికెటర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారనే విషయాన్ని ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. మార్చి 28 నుంచి మే 12 వరకు ఉన్న డేటాను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించినట్లు తెలిపింది.
ఈ జాబితాలో టాప్ 5 ప్లేయర్లలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(44 శాతం) అగ్రస్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ ఎంఎస్ ధోని(21 శాతం) రెండో స్థానం దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ధోని ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎంఐ ఓపెనర్ రోహిత్ శర్మ(18 శాతం), సంజు శాంసన్(10 శాతం), కేఎల్ రాహుల్(8 శాతం) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ జాబితాలో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా