మళ్లీ గాయపడ్డ స్టార్ స్పిన్నర్.. అఫ్గానిస్థాన్‌తో సిరీస్ మొత్తానికి దూరం
ABN , Publish Date - Sep 14 , 2026 | 07:41 PM
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ మధ్యలోనే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ మధ్యలోనే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో అతడు ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.
ఇటీవలే తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న వరుణ్‌కు మరోసారి గాయం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో జులైలో అతడికి హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయింది. దాని నుంచి కోలుకుని అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చిన వరుణ్.. తొలి టీ20లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే ఆ మ్యాచ్ తర్వాత అతడికి కొత్తగా గాయం అయినట్లు తెలుస్తోంది.
ఆసియా క్రీడలకు దూరమయ్యే అవకాశం?
తాజా గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఆసియా క్రీడలకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి జపాన్ వేదికగా ఈ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. కీలక స్పిన్నర్ మరోసారి గాయపడటంతో అతడి ఫిట్‌నెస్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది. ఇటీవల భారత ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడుతుండటంతో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో జరుగుతున్న గాయాల నిర్వహణపై కూడా విమర్శలు వస్తున్నాయి. వరుణ్ చక్రవర్తికి తాజాగా ఏర్పడిన గాయం కూడా ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది.
ఇవి కూడా చదవండి:
ఆసియా కప్: భారత పేసర్‌కు షాక్.. జరిమానా విధించిన ఐసీసీ
ట్రోఫీకి బదులు వాటర్ బాటిల్.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఫన్నీ సెలబ్రేషన్స్ వైరల్