ట్రోఫీకి బదులు వాటర్ బాటిల్.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఫన్నీ సెలబ్రేషన్స్ వైరల్
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:05 PM
ఆసియా కప్ విజయం తర్వాత భారత మహిళల సంబరాల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికారిక ప్రెజెంటేషన్ కార్యక్రమానికి భారత జట్టు హాజరు కాకపోవడంతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ట్రోఫీకి బదులుగా వాటర్ బాటిల్‌ను పైకెత్తి సెలబ్రేట్ చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఎనిమిదో ఆసియా కప్‌ను ముద్దాడింది భారత మహిళా జట్టు. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి మన అమ్మాయిలు నిరాకరించిన సంగతి తెలసిందే. ఆసియా కప్ విజయం తర్వాత భారత మహిళల సంబరాల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికారిక ప్రెజెంటేషన్ కార్యక్రమానికి భారత జట్టు హాజరు కాకపోవడంతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ట్రోఫీకి బదులుగా వాటర్ బాటిల్‌ను పైకెత్తి సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం భారత ఆటగాళ్లు టీమ్ ఫొటో కోసం ఒకచోట చేరారు. ఈ సమయంలో సహచరులు హర్మన్‌ప్రీత్ చేతికి వాటర్ బాటిల్ అందించారు. దాన్ని ట్రోఫీలా పైకెత్తాలని ఆమెను ఉత్సాహపరిచారు. తొలుత నవ్వుతూ కనిపించిన హర్మన్.. చివరకు వాటర్ బాటిల్‌ను పైకి ఎత్తి ట్రోఫీని ముద్దాడినట్లుగా సంబరాలు చేసుకుంది. దీంతో చుట్టుపక్కల ఉన్న ఆటగాళ్లంతా నవ్వుతూ కేరింతలు కొట్టారు. సాధారణంగా టైటిల్ గెలిచిన జట్టు ట్రోఫీని పైకెత్తి ఫొటోలకు పోజులివ్వడం ఆనవాయితీ. అయితే ఈసారి భారత జట్టు అందుకు భిన్నంగా వాటర్ బాటిల్‌తో సెలబ్రేట్ చేసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
ఫీల్డింగ్‌పై ఆందోళన లేదు.. మెరుగుపడేందుకు శ్రమిస్తున్నాం: అమోల్ మజుందార్
పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఐసీసీ.. ఏకంగా 11 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత