Share News

ఆసియా కప్: భారత పేసర్‌కు షాక్.. జరిమానా విధించిన ఐసీసీ

ABN , Publish Date - Sep 14 , 2026 | 07:09 PM

ఆసియా కప్‌ టైటిల్‌ గెలిచిన ఆనందంలో ఉన్న భారత మహిళల జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. భారత యువ పేసర్‌ క్రాంతి గౌడ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది.

ఆసియా కప్: భారత పేసర్‌కు షాక్.. జరిమానా విధించిన ఐసీసీ
Kranti Gaud

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ టైటిల్‌ గెలిచిన ఆనందంలో ఉన్న భారత మహిళల జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. భారత యువ పేసర్‌ క్రాంతి గౌడ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఆమె మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది. అంతేకాకుండా ఒక డీమెరిట్‌ పాయింట్‌ను కూడా కేటాయించింది.


శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఇమేశా దులానిని క్రాంతి గౌడ్‌ ఔట్‌ చేసింది. వికెట్‌ తీసిన అనంతరం పెవిలియన్‌ వైపు వేలు పెట్టి చూపిస్తూ బయటకు వెళ్లు అనే విధంగా సైగలు చేసింది. ఈ హావభావం బ్యాటర్‌ను కించపరిచేలా ఉన్న కారణంగా క్రాంతి గౌడ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆమె కూడా తప్పును అంగీకరించడంతో ఈ శిక్షను ఖరారు చేశారు.


తొలిసారి డీమెరిట్‌ పాయింట్‌

లెవల్‌-1 నిబంధన ఉల్లంఘనలకు అధికారికంగా మందలింపు నుంచి ప్లేయర్ మ్యాచ్‌ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం జరిమానా వరకు విధించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఒకటి లేదా రెండు డీమెరిట్‌ పాయింట్లు కేటాయించవచ్చు. క్రాంతి గౌడ్‌కు విధించిన ఒక డీమెరిట్‌ పాయింట్‌.. గత 24 నెలల వ్యవధిలో ఆమెకు ఇదే మొదటిది.


ఇవి కూడా చదవండి:

ఫీల్డింగ్‌పై ఆందోళన లేదు.. మెరుగుపడేందుకు శ్రమిస్తున్నాం: అమోల్ మజుందార్

పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఐసీసీ.. ఏకంగా 11 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత

Updated Date - Sep 14 , 2026 | 07:09 PM