Share News

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

ABN , Publish Date - Jul 27 , 2026 | 05:40 PM

జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన బ్యాటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన బ్యాటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన వైభవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు.


‘నా కల నెరవేరింది. నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా మీద నేను పెట్టుకున్న నమ్మకం వల్లే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడగలిగాను. జట్టుకు మంచి ఆరంభం అందించాలనేదే నా లక్ష్యం. మంచి ప్రారంభం లభిస్తే దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మలచాలని ప్రయత్నిస్తాను. హరారేకు వచ్చిన తర్వాత రెండు, మూడు రోజులు మా సన్నాహాలు చాలా బాగా జరిగాయి. అండర్-19 ప్రపంచ కప్‌లో కూడా ఇక్కడే ఆడాను. కెప్టెన్, కోచ్‌లు, జట్టు సభ్యులంతా నాపై నమ్మకం ఉంచారు. వారి మద్దతు ఎంతో ఆనందం ఇచ్చింది’ అని వైభవ్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం.. ముత్తుపాండికి నజరానా ప్రకటించిన సీఎం విజయ్

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్: భారత షూటర్ల హవా.. ఈషా సింగ్‌కు స్వర్ణం

Updated Date - Jul 27 , 2026 | 05:40 PM