ట్రై సిరీస్: నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:16 AM
శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక ఎ, భారత్ ఎ జట్లు తలపడుతున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. విదేశీ పిచ్‌పై రాణించలేకపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక ఎ, భారత్ ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యువ భారత జట్టు కాస్త తడబడుతోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. విదేశీ పిచ్‌పై రాణించలేకపోయాడు. వైభవ్ సూర్యవంశీ దూకుడు ఇన్నింగ్స్‌కు అలవాటు పడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వైభవ్ 12 బంతుల్లో కేవలం 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మూడు ఫోర్లతో దూకుడుగా ఆడుతున్నట్లు కనిపించనప్పటికీ మహ్మద్ షిరాజ్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన వైభవ్.. మిడాఫ్‌లో దొరికిపోయాడు. వైభవ్ కొట్టిన బంతిని సాహన్ అరాచిగే ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు.
మరో విధ్వంసకర ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(2) కూడా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. 11 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్.. కేవలం 2 పరుగులే చేయగలిగాడు. కరుణారత్నే బౌలింగ్‌లో సమరవిక్రమకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో స్పల్ప స్కోర్‌కే భారత్ ఎ జట్టు 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ వార్త రాసే సమయానికి 13 ఓవర్లు ఆడిన భారత యువ జట్టు.. 68 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(18*), ప్రియాంశ్ ఆర్య(32*) ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత
అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?