జడేజా వారసుడిగా..
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:13 AM
మానవ్ సుథార్ అరంగేట్ర టెస్టులోనే అద్భుతంగా రాణించాడు. మొదట బ్యాటింగ్‌లో 28 పరుగులతో రాణించిన ఈ రాజస్థాన్ కుర్రాడు.. ఆ తర్వాత...
మానవ్ సుథార్ అరంగేట్ర టెస్టులోనే అద్భుతంగా రాణించాడు. మొదట బ్యాటింగ్‌లో 28 పరుగులతో రాణించిన ఈ రాజస్థాన్ కుర్రాడు.. ఆ తర్వాత అఫ్ఘాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన మానవ్ బంతిని చక్కగా టర్న్ చేయడంతో పాటు స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఒకే చోట బంతిని వేయగలిగాడు. మొత్తంగా ఆరు వికెట్లతో ఈ శతాబ్ధంలో తొలి ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా మానవ్ నిలిచాడు. గతంలో అమిత్ మిశ్రా (2008లో) ఈ ఫీట్ సాధించాడు. ఈ ప్రతిభతో వెటరన్ జడేజా వారసుడిగా 23 ఏళ్ల మానవ్ కితాబు అందుకుంటున్నాడు. ఐపీఎల్ గత మూడు సీజన్ల నుంచి గుజరాత్‌కు ఆడుతున్న మానవ్.. తన తొలి రంజీ సీజన్ (2022-23)లోనే ఆరు మ్యాచ్‌ల్లో 39 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.
ఇవి కూడా చదవండి:
అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత
అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?