Share News

ఆఖరాటలో ఏం చేస్తారో?

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:16 AM

తమ మార్క్‌ ఆటతో సాకర్‌ లోకాన్ని ఉర్రూతలూగించారు.. అబ్బురపరిచే విన్యాసాలతో అలరించారు. మైదానంలో వాళ్లున్నారంటే.. ఆ మజానే వేరు. ఎంతో ఫాలోయింగ్‌ ఉన్న...

ఆఖరాటలో ఏం చేస్తారో?

2 రోజుల్లో

తమ మార్క్‌ ఆటతో సాకర్‌ లోకాన్ని ఉర్రూతలూగించారు.. అబ్బురపరిచే విన్యాసాలతో అలరించారు. మైదానంలో వాళ్లున్నారంటే.. ఆ మజానే వేరు. ఎంతో ఫాలోయింగ్‌ ఉన్న ఆ స్టార్లలో కొందరికి ఇదే చివరి వరల్డ్‌కప్‌ కావచ్చు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

క్రిస్టియానో రొనాల్డో

పోర్చుగల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఆరోసారి వరల్డ్‌కప్‌లో పోటీ పడుతున్నాడు. 41 ఏళ్ల రొనాల్డోకు ఇదే చివరి మెగా టోర్నీగా అంతా భావిస్తున్నారు. రియల్‌ మాడ్రిడ్‌, మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరఫున ఆడిన క్రిస్టియానో.. పోర్చుగల్‌ తరఫున 143 గోల్స్‌ చేశాడు. క్లబ్‌ టోర్నీలో ఎన్నో ఘనతలు సాధించిన రొనాల్డో కెరీర్‌లో ఫిఫా ప్రపంచకప్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆఖరిసారైనా కలల కప్‌ను ముద్దాడాలనే పట్టుదలతో ఉన్నాడు.

లియోనెల్‌ మెస్సీ

రొనాల్డో తరహాలోనే అర్జెంటీనా గ్రేట్‌ లియోనెల్‌ మెస్సీకి కూడా ఇది ఆరో వరల్డ్‌కప్‌ కావడం విశేషం. అయితే, ఈసారి డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగుతున్న అర్జెంటీనా.. మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవాలనుకొంటోంది. కానీ గాయంతో బాధపడుతున్న 38 ఏళ్ల మెస్సీ బరిలోకి దిగుతాడా? అన్న అనుమానం ఉంది. ఏదేమైనా.. మెస్సీ మరోసారి ప్రపంచ కప్‌లో మెరిసి వీడ్కోలు తీసుకోవాలన్నది కోట్లాది అభిమానుల ఆశ.

నెమార్‌ జూనియర్‌

రొనాల్డో, మెస్సీలతో పోల్చితే నెమార్‌ జూనియర్‌ ఎంతో చిన్నవాడు. నాలుగో సారి ప్రపంచకప్‌ ఆడుతున్న 34 ఏళ్ల నెమార్‌కు బ్రెజిల్‌ తుది జట్టులో స్థానంపై పూర్తి స్పష్టత లేదు. మోకాలి సర్జరీలతో చాలా రోజులు ఆటకు దూరమయ్యాడు. పెరుగుతున్న వయసు, వెంటాడుతున్న గాయాల కారణంగా ఈ మెగా టోర్నీతో కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కెవిన్‌ డిబ్రుయెన్‌

బెల్జియం గోల్డెన్‌ జనరేషన్‌ అయిన 2014-22లో డిబ్రుయెన్‌ ఓ వెలుగు వెలిగాడు. మూడు వరల్డ్‌క్‌పల్లో ఆడిన 35 ఏళ్ల కెవిన్‌కు ఇదే చివరిది. ఈ మెగా ఈవెంట్‌లో బెల్జియంను ఫైనల్‌కు చేర్చాలనే కసితో ఉన్నాడు.

లూకా మోద్రిచ్‌

2018 సాకర్‌ కప్‌లో క్రొయేషియాను ఫైనల్‌ చేర్చడంలో, 2022లో మూడో స్థానంలో నిలపడంలోనూ లూకా మోద్రిచ్‌దే కీలకపాత్ర. ఐదో, ఆఖరిసారి మోద్రిచ్‌ వరల్డ్‌క్‌పలో ఆడడానికి సిద్ధమవుతున్నాడు. 40 ఏళ్ల మోద్రిచ్‌ చెంప ఎముకకు సర్జరీ జరిగింది. కానీ, అతడిపై జట్టు ఎంతో ఆధారపడి ఉంది.

ఇవి కూడా చదవండి:

అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత

అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?

Updated Date - Jun 09 , 2026 | 03:16 AM