Share News

యూఎస్ ఓపెన్2026లో ముగిసిన నవోమి ఒసాకా ప్రయాణం

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:06 PM

యూఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ నవోమి ఒసాకా పరాజయం పాలైంది. కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా రైబాకినా చేతిలో ఒసాకా ఓటమిపాలైంది.

యూఎస్ ఓపెన్2026లో ముగిసిన నవోమి ఒసాకా ప్రయాణం
US Open 2026,

స్పోర్ట్స్ డెస్క్: యూఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ నవోమి ఒసాకా పరాజయం పాలైంది. సోమవారం జరిగిన ఈ ఏకపక్ష పోరులో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్, కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా రైబాకినా 6-1, 6-4 తేడాతో ఒసాకాను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆటలో ఓడిన నవోమి ఓసాకా.. ఫ్యాషన్ పరంగా మాత్రం అభిమానుల మనసు గెలిచింది. మ్యాచ్ సందర్భంగా ఆమె ధరించిన కోట్ అందరిని ఆకర్షించింది.


నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ నవోమి ఒసాకా.. తాను ఆడే ప్రతి మ్యాచ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటుంది. అలాగే యూఎస్ ఓపెన్‌లో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ను కూడా చిరస్మరణీయంగా ఉండేలా చూసుకుంది. రైబాకినాతో జరిగిన మ్యాచ్ కోసం ఒసాకా వివిధ రకాల డిజైన్లను ఒకచోట చేర్చినట్లు ఉన్న ఒక కోట్‌ను ధరించింది. దీనిని బ్రూక్లిన్‌కు చెందిన స్ట్రీట్‌వేర్ లేబుల్ కిడ్‌సూపర్ రూపొందించింది.


లా రోచ్ అనే ఫ్యాషన్ డిజైనర్ దీనికి మరింత మెరుగులు దిద్దారు. మొత్తంగా నవోమి ఓసాకా ధరించిన ఈ కోట్ అందరిని ఆకట్టుంది. 'దాన్ని వేసుకున్నప్పుడు నాకు చాలా విభిన్నంగా ఉండటంతో పాటు ప్రత్యేక అనుభూతి కలిగింది. అలానే ఇది న్యూయార్క్‌ను ప్రతిబింబించిందని నాకు అనిపించింది' అని మ్యాచ్ తర్వాత ఒసాకా వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం

అమరావతిని మారుస్తామనడం అవివేకం

Updated Date - Sep 08 , 2026 | 04:35 PM