Share News

అండర్ 19 ఆసియా కప్: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ.. పాక్ టార్గెట్ 209

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:28 PM

అండర్ 19 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 208 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్‌కు 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అండర్ 19 ఆసియా కప్: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ.. పాక్ టార్గెట్ 209
U19 Asia Cup

ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 208 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్‌కు 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ బ్యాటర్ అర్జున్ రాజ్‌పుత్(107; 85 బంతుల్లో) సెంచరీతో చెలరేగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. అర్జున్ మాత్రం క్రీజులో నిలబడి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.


వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్(22), ఆఖరిలో కావ్య పటేల్(23) పర్వాలేదనిపించారు. కెప్టెన్ లక్ష్య రాజేశ్‌ రాయ్‌ చందాని (0), యశ్‌బర్దాన్ చౌహాన్ (1), యశ్వీర్ గౌడ్ (4), వీకే వినీత్ (8), మోహిత్ ఉల్వా (7) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అన్వయ్ ద్రవిడ్ (10), మనల్ చౌహాన్ (11) పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో అలీ రజా 3, రిజ్వానుల్లా 3, నికాబ్ షాఫిక్ 3, సయ్యమ్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 08 , 2026 | 02:38 PM