అధికారిణికి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన కేఎల్ రాహుల్.. వీడియో వైరల్!
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:37 PM
న్యూజిలాండ్‌తో మూడో వన్డే కోసం భారత్ హామిల్టన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తన మంచి మనసును చాటాడు.
స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో మూడో వన్డే కోసం భారత్ హామిల్టన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తన మంచి మనసును చాటాడు. రెండో మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ అవార్డును కేఎల్ అందుకొన్నాడు. అలా బహుమతిగా వచ్చిన స్మార్ట్ ఫోన్‌ను ఓ అధికారిణికి ఇచ్చాడు. దీంతో రాహుల్ ఇచ్చిన సడెన్ సర్‌ప్రైజ్‌కు కాసేపు షాక్ గురైన సదరు అధికారిణీ.. తర్వాత సంతోషం వ్యక్తం చేసింది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
‘నాకు కేఎల్ రాహుల్ స్మార్ట్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో కాస్త షాక్‌కు గురయ్యా. ఆయన మంచి మనసుకు ఇది నిదర్శనం. ఇలాంటి సంఘటన జరుగుతుందని అసలు ఊహించలేదు’ అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో మహిళా అధికారిణి వెల్లడించారు. ‘గొప్ప ప్లేయర్.. అంతకంటే గొప్ప మనసు’ అని బీసీసీఐ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. రాహుల్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ క్లాస్ బ్యాటరే కాకుండా.. మంచి మనసున్న వ్యక్తి అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. మైదానంలోనే కాకుండా వెలుపల కూడా ఇలాంటి చర్యలతో అందరూ మనసులను రాహుల్ గెల్చుకున్నాడని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కష్టాల్లో ఉన్న టీమిండియాను కేఎల్ రాహుల్ ఆదుకున్నాడు. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. రోహిత్, గిల్, కోహ్లీ త్వరగా ఔట్ కావడంతో.. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో రాహుల్(24*) క్రీజులోకి వచ్చి.. జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్ నాలుగు పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో గుర్నూర్ బ్రార్ తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలైన 4/30 నమోదు చేశాడు. మూడో వన్డే నవంబర్ 10న హామిల్టన్ వేదికగా జరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
అయోధ్యపై దుష్టశక్తుల చూపు పడనివ్వం: యోగి ఆదిత్యనాథ్
'2029లో బీజేపీ ఓటమి ఖాయం'.. అభిజీత్ దీప్కే జోస్యం