టీ20 ప్రపంచ కప్ 2026: జట్ల వారీగా ప్రైజ్‌మనీ పంపిణీ.. ఎవరికి ఎంతంటే?
ABN , Publish Date - Mar 11 , 2026 | 07:02 PM
టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టుకు బీసీసీఐ రూ.131కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. ఐసీసీ కూడా టోర్నీ ప్రైజ్‌మనీ రూ.103 కోట్లకు సంబంధించిన పంపిణీ వివరాలను వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడో సారి పొట్టి ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడి చరిత్ర సృష్టించింది. దీంతో భారత జట్టుకు బీసీసీఐ రూ.131కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. ఐసీసీ కూడా టోర్నీ ప్రైజ్‌మనీ రూ.103 కోట్లకు సంబంధించిన పంపిణీ వివరాలను వెల్లడించింది. విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.24.25 కోట్లు దక్కాయి.
ప్రైజ్ మనీ పంపిణీ ఇలా..
భారత్ (ఛాంపియన్): రూ. 24.25 కోట్లు
న్యూజిలాండ్ (రన్నరప్): రూ.13.08 కోట్లు
సౌతాఫ్రికా (సెమీ ఫైనలిస్ట్): రూ.9.24 కోట్లు
ఇంగ్లండ్ (సెమీ ఫైనలిస్ట్): రూ.8.96 కోట్లు
సూపర్ 8లో నిష్క్రమించిన జట్లకు..
వెస్టిండీస్: రూ.4.95 కోట్లు
పాకిస్థాన్: రూ.4.80 కోట్లు
జింబాబ్వే: రూ.4.52 కోట్లు
శ్రీలంక: రూ.4.37 కోట్లు
లీగ్ స్టేజ్ జట్లకు..
అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ: తలో రూ.2.85 కోట్లు
స్కాట్లాండ్: రూ.2.56 కోట్లు
ఐర్లాండ్: రూ.2.50 కోట్లు
ఇటలీ, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్: తలో రూ.2.35 కోట్లు
కెనడా, నమీబియా, ఒమన్: తలో రూ.2.06 కోట్లు
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్