Share News

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ 169

ABN , Publish Date - Feb 25 , 2026 | 08:58 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ప్రేమదాస స్టేడియం వేదికగా న్యూజిలాండ్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. శ్రీలంకకు 169 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ 169
New Zealand vs Sri Lanka

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ప్రేమదాస స్టేడియం వేదికగా న్యూజిలాండ్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. శ్రీలంకకు 169 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బ్యాటర్లు ఆదిలో కాస్త తడబడినా.. మెల్లగా మూమెంటమ్ అందుకున్నారు. 86 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ న్యూజిలాండ్ జట్టును కెప్టెన్ మిచెల్ శాంట్నర్(47; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మెక్‌కాంచీ (31*; 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 47 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


టిమ్ సీఫర్ట్(8), ఫిన్ అలెన్(23), రచిన్ రవీంద్ర(32), గ్లెన్ ఫిలిప్స్(18) పర్వాలేదనిపించారు. డారిల్ మిచెల్(3), చాప్‌మన్(0) విఫలమయ్యారు. ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసిన శ్రీలంక బ్యాటర్లు.. ఆఖరిలో ధాటిగా పరుగులు సమర్పించుకున్నారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా తలో 3, వెల్లలాగే 1 వికెట్ తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

బట్లర్.. పవర్ హౌస్ ఆఫ్ వరల్డ్ క్రికెట్: హ్యారీ బ్రూక్

టీమిండియా మరో మ్యాచ్ ఓడితే తిప్పలు తప్పవు: రవి శాస్త్రి

Updated Date - Feb 25 , 2026 | 08:58 PM