టీమిండియా మరో మ్యాచ్ ఓడితే తిప్పలు తప్పవు: రవి శాస్త్రి
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:27 PM
టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికాపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి భారత జట్టుకు పలు కీలక సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికాపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత్ సెమీస్ ఆశలు కాస్త సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి భారత జట్టుకు పలు కీలక సూచనలు చేశాడు.
‘మీరు టీ20 ప్రపంచ ప్రపంచ కప్‌లో వరుసగా 12 మ్యాచ్‌ల్లో గెలిచారు. తాజాగా సౌతాఫ్రికాపై ఓటమి పాలయ్యారు. ఇది మీకు ఓ మేలుకొలుపు. జట్టు కూర్పులో మార్పులు, చేర్పులు చేసేందుకు సమయం ఆసన్నమైంది. జట్టు ప్రణాళికల గురించి కూడా పునరాలోచన చేయాలి. భారత్ ఇకపై తేలికగా తీసుకోదు. ఎందుకంటే టీమిండియా మరో మ్యాచ్ ఓడితే తీవ్రమైన ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. అందుకే అక్షర్ పటేల్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవాలి. అతడి అనుభవం టీమ్‌కు చాలా అవసరం. వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఈ మ్యాచ్‌లో ఆడించాలి. జట్టులో అదనపు స్పిన్నర్ ఉంటే మంచిదే. అక్షర్‌ను నం.8లో బ్యాటింగ్ చేయించాలి. ఐదో స్థానంలో హార్దిక్ పాండ్య, నం.6లో శివం దూబే, ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌కు రావాలి’ అని రవిశాస్త్రి సూచించాడు.
కాగా గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్-జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. మార్చి 1 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-వెస్టిండీస్ మ్యాచ్ జరగనుంది. సెమీస్‌కు అర్హత సాధించాలంటే..ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియా భారీ నెట్‌రన్ రేట్‌తో విజయం సాధించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ.. తొలి కెప్టెన్ హ్యారీ బ్రూక్
సూపర్ సెంచరీ వెనుక మాస్టర్ మైండ్.. సీక్రెట్ బయటపెట్టిన హ్యారీ బ్రూక్