Share News

జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు.. టీమిండియాకు అదిరిపోయే న్యూస్..!

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:22 PM

గురువారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే...

జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు.. టీమిండియాకు అదిరిపోయే న్యూస్..!
Team India semi final chances

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 ఆసక్తికరంగా సాగుతోంది. గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్స్ చేరింది. మరో స్థానం కోసం శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్ పోటీ పడుతున్నాయి. మరోవైపు గ్రూప్-1లో ఇప్పటి వరకు ఏ జట్టు సెమీస్ బెర్తును కన్ఫర్మ్ చేసుకోలేదు. ఈ రేసులో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి.


దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా(Team India) 76 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. దీంతో భారత్ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్‌ జట్లతో జరగబోయే మ్యాచుల్లో భారత్ తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో టీమిండియా అభిమానులకు ఆనందాన్ని కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది.


ఫిబ్రవరి 26న భారత్ , జింబాబ్వే తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ కోసం కొత్త పిచ్‌ను వినియోగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ పిచ్‌ను దేశవాళీ మ్యాచ్‌ల కోసం వినియోగించలేదని సమాచారం. గురువారం జరిగే మ్యాచ్‌కు ఉపయోగించే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని తెలుస్తోంది. బ్యాట్‌ మీదకు బంతి చక్కగా వస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


దీంతో మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. భారీ స్కోర్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. భారత్ సెమీస్‌కు చేరాలంటే.. ఈ మ్యాచ్ కీలకంగా మారింది. జింబాబ్వేపై భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ క్రమంలోనే పిచ్ రిపోర్ట్ టీమిండియాకు శుభవార్తేనని క్రీడా నిపుణులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ.. తొలి కెప్టెన్ హ్యారీ బ్రూక్

సూపర్ సెంచరీ వెనుక మాస్టర్ మైండ్.. సీక్రెట్ బయటపెట్టిన హ్యారీ బ్రూక్

Updated Date - Feb 25 , 2026 | 01:36 PM