బట్లర్.. పవర్ హౌస్ ఆఫ్ వరల్డ్ క్రికెట్: హ్యారీ బ్రూక్
ABN , Publish Date - Feb 25 , 2026 | 03:15 PM
టీ20 ప్రపంచ కప్2026లో సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఇప్పటి వరకు కేవలం 62 పరుగులే చేసిన సీనియర్ ప్లేయర్ బట్లర్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ హ్యారీ బ్రూక్.. బట్లర్‌కు అండగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్2026లో సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచిన సంగతి తెలిసిందే. మంగళవారం పాకిస్థాన్‌పై 2 రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే జట్టులో సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఫామ్‌పై చర్చలు మొదలయ్యాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు కేవలం 62 పరుగులే చేసిన బట్లర్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ హ్యారీ బ్రూక్.. బట్లర్‌కు అండగా నిలిచాడు.
‘బట్లర్ గురించి నేను చాలా సార్లు చెప్పాను. అతడు పవర్ హాస్ ఆఫ్ వరల్డ్ క్రికెట్. జట్టుకు అవసరం అయినప్పుడల్లా ఆదుకున్నాడు. ప్రతి ఫార్మాట్‌లో రాణించాడు. వన్డే, టీ20 ప్రపంచ కప్‌లు గెలిచాడు. ప్రస్తుతం ఫామ్‌లో లేడు అంతే. ప్రతి ప్లేయర్‌కు ఇలాంటి దశ ఒకటుంటుంది. బట్లర్ 500కి పైగా టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ తరఫున 150కి పైగా మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం బంతి అతడి బ్యాట్‌కు మిడిల్ అవ్వకపోవచ్చు. కానీ అతడే మా బెస్ట్ ప్లేయర్’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. 35 ఏళ్ల బట్లర్ ఇంగ్లండ్ తరఫున 153 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 4012 పరుగులు సాధించాడు. తాజాగా ఇంగ్లండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు.
ఇదిలా ఉండగా.. సూపర్ 8 గ్రూప్ 2లో ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. రెండో స్థానం కోసం శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్ పోటీ పడుతున్నాయి. తన చివరి సూపర్ 8 మ్యాచ్‌ను ఇంగ్లండ్.. న్యూజిలాండ్‌తో ఆడనుంది. మరోవైపు గ్రూప్ 1లో ఇంకా ఏ జట్టు సెమీస్‌కి వెళ్లలేదు. భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ.. తొలి కెప్టెన్ హ్యారీ బ్రూక్
సూపర్ సెంచరీ వెనుక మాస్టర్ మైండ్.. సీక్రెట్ బయటపెట్టిన హ్యారీ బ్రూక్