రంజీ ట్రోఫీ ఫైనల్.. ముగిసిన రెండో రోజు ఆట
ABN , Publish Date - Feb 25 , 2026 | 06:09 PM
రంజీ ట్రోఫీ ఫైనల్‌లో భాగంగా కర్ణాటక-జమ్మూ కశ్మీర్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోన్న జమ్మూ జట్టు అదరగొడుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 527 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రంజీ ట్రోఫీ ఫైనల్‌లో భాగంగా కర్ణాటక-జమ్ము కశ్మీర్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోన్న జమ్ము జట్టు అదరగొడుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 527 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 117 పరుగులతో అజేయంగా ఉన్న శుభమ్ పుందిర్.. రెండో రోజు మరో నాలుగు పరుగులు జోడించి 121 పరుగులకు ఔటయ్యాడు. కాగా ఇప్పటికి వరకు ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు నమోదు కావడం విశేషం. కర్ణాటక బౌలర్లు ఎంత శ్రమించినా జమ్ము బ్యాటర్లను ఆలౌట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం క్రీజులో సాహిల్ లోత్రా(57*), అబిద్ ముస్తాక్(20*) ఉన్నారు.
ఓవర్‌నైట్ 284/2 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన జమ్ముకశ్మీర్.. స్పల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయింది. తొలి రోజు రిటైర్డ్ హర్ట్‌గా డకౌట్‌కు వెళ్లిన కెప్టెన్ పరాస్ డోగ్రా(70) తిరిగి క్రీజులోకి వచ్చాడు. అతడు కన్హియా వాదవాన్(70)తో కలిసి ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పటి వరకు కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, విద్యాధర్ పాటిల్, శ్రేయాస్ గోపాల్, శిఖర్ శెట్టి తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
బట్లర్.. పవర్ హౌస్ ఆఫ్ వరల్డ్ క్రికెట్: హ్యారీ బ్రూక్
టీమిండియా మరో మ్యాచ్ ఓడితే తిప్పలు తప్పవు: రవి శాస్త్రి