భారత్-జింబాబ్వే మ్యాచ్.. రింకు సింగ్‌పై టీమిండియా కీలక అప్‌డేట్
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:28 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ రింకు సింగ్ ఉన్నట్టుండి జట్టుని వీడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడిపై టీమిండియా ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది. సూపర్ 8లో జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్‌లో రింకు అందుబాటులో ఉంటాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ కోటక్ స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్, ఫినిషర్ రింకు సింగ్ మంగళవారం ఉన్నట్టుండి జట్టుని వీడిన సంగతి తెలిసిందే. కుటుంబ అత్యవసర కారణాల వల్ల రింకు స్వగ్రామానికి వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతడి తండ్రి కచన్‌చంద్ సింగ్ క్యాన్సర్‌తో పోరాడుతూ వెంటిలెటర్‌పై చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. గురువారం చెన్నైలోని చిదంబరం వేదికగా భారత్.. జింబాబ్వేతో కీలక పోరులో తలపడనుంది. రింకు ఉన్నట్టుండి జట్టును వీడటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే రింకు సింగ్‌పై టీమిండియా ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
సూపర్ 8లో జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్‌లో రింకు సింగ్ అందుబాటులో ఉంటాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ శితాంశు కోటక్ స్పష్టం చేశారు. ‘రింకు తండ్రి అనారోగ్యంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో ఉండటానికి రింకు జట్టు వీడాడు. కానీ జింబాబ్వేతో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడు. బుధవారం సాయంత్రానికి రింకు భారత జట్టుతో చేరుతాడు’ అని కోటక్ స్పష్టం చేశాడు.
భారత్‌కు కీలక మ్యాచ్
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కు జింబాబ్వేతో మ్యాచ్ అత్యంత కీలకం. సూపర్ 8లో దక్షిణాఫ్రికాపై 76 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. దీనివల్ల నెట్ రన్‌రేట్ -3.800కు పడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. అభిషేక్ శర్మ ఫామ్ జట్టుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటు ఫినిషర్‌గా రింకు సింగ్ కూడా మంచి ప్రదర్శనలు చేయలేదు. జింబాబ్వేతో మ్యాచ్‌లో కట్టుదిట్టమైన ప్రణాళికతో బరిలోకి దిగి విజయం సాధించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
బట్లర్.. పవర్ హౌస్ ఆఫ్ వరల్డ్ క్రికెట్: హ్యారీ బ్రూక్
టీమిండియా మరో మ్యాచ్ ఓడితే తిప్పలు తప్పవు: రవి శాస్త్రి