2027 వన్డే ప్రపంచ కప్‌పై ఇప్పటి నుంచే చర్చలెందుకు?: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Nov 10 , 2026 | 08:25 PM
2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉండగానే టీమిండియా ఆటగాళ్ల ఎంపికపై చర్చలు మొదలుకావడాన్ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉండగానే టీమిండియా ఆటగాళ్ల ఎంపికపై చర్చలు మొదలుకావడాన్ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. మహమ్మద్ సిరాజ్ జట్టులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క వన్డేలోనూ ఆడలేదు. ఈ నేపథ్యంలో సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు? 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో అతడికి చోటు ఉంటుందా? అని టాస్ అనంతరం గావస్కర్‌ను ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. ప్రపంచకప్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం సరికాదని గావస్కర్ స్పష్టం చేశాడు.
‘మనం ఇంగ్లండ్ జట్టు ఎప్పుడూ చేసే తప్పునే చేస్తున్నాం. ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడాల్సి వస్తే.. ఇంగ్లండ్ జట్టు ఆ సిరీస్ గురించే ఆలోచిస్తుంది. దాంతో తమ సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌లను కోల్పోతుంది. మనం కూడా ఇప్పుడు మనకు ఏం అవసరమో దానిపైనే దృష్టి పెట్టాలి. వన్డే ప్రపంచ కప్ ఆడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆలోచించవచ్చు. ముందుగా ఇక్కడ సిరీస్ గెలవాలి.
టీ20 సిరీస్‌ను ఇప్పటికే గెలిచాం. ఇప్పుడు వన్డే సిరీస్ కూడా గెలిస్తే టెస్టు మ్యాచ్‌ల్లోకి మంచి ఆత్మవిశ్వాసంతో వెళ్లవచ్చు. దక్షిణాఫ్రికా పర్యటనకు ఇంకా ఏడాది సమయం ఉంది. అప్పుడే సిరాజ్ ఉండాలా? బుమ్రా ఉండాలా? అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం మరీ ముందుకు వెళ్లి ఆలోచిస్తున్నాం. ఈ మ్యాచ్ తర్వాత సిరాజ్ టెస్టుల సన్నాహకాల్లో పాల్గొనడానికి వెళ్తాడని నాకు తెలుసు. అయితే జట్టు కూర్పును సాధ్యమైనంత వరకు మార్చకుండా ఉంచాలన్నదే మా ప్రణాళిక’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ఆసియా కప్: యూఏఈపై ఘన విజయం.. సెమీ ఫైనల్‌కు భారత్
ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్లు?.. బీసీసీఐ ప్లాన్ అదేనా!