Share News

అండర్ 19 ఆసియా కప్: యూఏఈపై ఘన విజయం.. సెమీ ఫైనల్‌కు భారత్

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:13 PM

అండర్ 19 ఆసియా కప్ 2026లో యూఏఈపై భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 310 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన యూఏఈ జట్టు.. 239 పరుగులకు ఆలౌటైంది

అండర్ 19 ఆసియా కప్: యూఏఈపై ఘన విజయం.. సెమీ ఫైనల్‌కు భారత్
U19 Asia Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ఆసియా కప్ 2026లో యూఏఈపై భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 310 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన యూఏఈ జట్టు.. 239 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత బౌలర్ ఇషాన్ సూద్ 4 వికెట్లతో చెలరేగి.. యూఏఈ బ్యాటర్ల పతనాన్ని శాసించాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా యూఏఈ బ్యాటర్ అహ్మద్(74) ఒంటరి పోరాటం చేశాడు. అయినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.


నూరుల్లా ఆయోబి(39), యాయిన్ రాయ్(29), అయాన్(27) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. జైనుల్లా(16), మహ్మద్ నఫీజ్(14), బిలాల్ ఖాన్(0), ఉద్దిశ్(13), మొహమ్మద్ సాద్(3), హదాయాతుల్లా(0) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరూ వికెట్ తీశారు. ఇషాన్ సూద్ 4, మోహిత్, మనాల్, కావ్య పటేల్, యశ్‌బర్దన్, ఆర్యన్, అర్జున్ తలొక వికెట్ చొప్పున పడగొట్టారు.


అంతకు ముందు, తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్(160) భారీ సెంచరీ, వీకే వినీత్(67) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ లక్ష్య రాజేశ్(17), అర్జున్ రాజ్‌పుత్(4), యశ్‌బర్దన్ చౌహాన్(17), అన్వయ్ ద్రవిడ్(12), మనాల్ చౌహాన్(1) పరుగులు చేశారు. మోహిత్(7*), ఆర్యన్(2*) నాటౌట్‌గా నిలిచారు. యూఏఈ బౌలర్లలో నసీం ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా.. హదాయాతుల్లా, నూరుల్లా, అయాన్ మిస్బా తలొక వికెట్ చొప్పున పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

శాండ్‌పేపర్ వివాదం: నాకైతే తెలియదు.. ఖవాజా ఆరోపణలకు స్టార్క్ కౌంటర్!

అండర్ 19 ఆసియా కప్‌: ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం.. యూఏఈపై 160 పరుగులతో..

Updated Date - Nov 10 , 2026 | 06:18 PM