Share News

నో ట్రేడ్.. అక్షర్ పటేల్, అశుతోష్ శర్మలపై ఢిల్లీ క్యాపిటల్స్ క్లారిటీ

ABN , Publish Date - Nov 10 , 2026 | 04:15 PM

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, యువ బ్యాటర్ అశుతోష్ శర్మలను ట్రేడ్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

నో ట్రేడ్.. అక్షర్ పటేల్, అశుతోష్ శర్మలపై ఢిల్లీ క్యాపిటల్స్ క్లారిటీ
Axar Patel, Ashutosh Sharma

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, యువ బ్యాటర్ అశుతోష్ శర్మలను ట్రేడ్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు వచ్చే సీజన్‌లోనూ ఢిల్లీ జట్టులోనే కొనసాగనున్నారు. అంతేకాదు.. ఢిల్లీ ఫ్రాంచైజీ ట్రేడింగ్ విండోను కూడా మూసివేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 17న రిటెన్షన్ గడువు ముగుస్తుండటంతో ఇకపై ఎలాంటి ఆటగాళ్ల మార్పిడులు ఉండవని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. దీంతో గత కొన్ని రోజులుగా అక్షర్, అశుతోష్ భవిష్యత్తుపై సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.


ఇటీవల అక్షర్ పటేల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసుకోబోతోందని ప్రచారం జరిగింది. మరోవైపు అశుతోష్ శర్మపై కూడా పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరినీ వదులుకునే ప్రసక్తే లేదని ఢిల్లీ క్యాపిటల్స్ స్పష్టం చేసింది. 'ఢిల్లీ క్యాపిటల్స్ పరంగా ఇకపై ఎలాంటి ట్రేడ్స్ ఉండవు' అని ఫ్రాంచైజీకి చెందిన ఓ వర్గం వెల్లడించినట్లు సమాచారం.


కెప్టెన్సీ ఎవరికి?

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇప్పుడు అసలైన సమస్య కెప్టెన్సీ ఎంపిక. గత సీజన్‌లో అక్షర్ పటేల్ జట్టును నడిపించాడు. కానీ ఇప్పుడు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా నాయకత్వ బాధ్యతలు చేపట్టగల ఆటగాడే. దీంతో ఐపీఎల్ 2027లో జట్టు పగ్గాలు ఎవరికి అప్పగించాలనే దానిపై ఢిల్లీ యాజమాన్యం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అక్షర్‌ను కొనసాగించినంత మాత్రాన కెప్టెన్సీ కూడా అతడికే దక్కుతుందని చెప్పలేని పరిస్థితి.


ఇవి కూడా చదవండి:

శాండ్‌పేపర్ వివాదం: నాకైతే తెలియదు.. ఖవాజా ఆరోపణలకు స్టార్క్ కౌంటర్!

అండర్ 19 ఆసియా కప్‌: ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం.. యూఏఈపై 160 పరుగులతో..

Updated Date - Nov 10 , 2026 | 04:15 PM