న్యూజిలాండ్‌తో టెస్టులకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్.. జట్టుతో కలవనున్న పంత్!
ABN , Publish Date - Nov 10 , 2026 | 07:14 PM
న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించనుంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్ సాధించి భారత జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించనుంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్ సాధించి భారత జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి పంత్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో నవంబర్ 12న అతడు న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌కు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. నవంబర్ 19 నుంచి ఆతిథ్య జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆడుతున్న సమయంలో పంత్ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. దీంతో అతడిని తొలుత అనధికారిక టెస్టు కోసం ప్రకటించిన ఇండియా-ఎ జట్టులో ఎంపిక చేశారు. అయితే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ లభించకపోవడంతో జట్టుతో కలవలేకపోయాడు. తాజాగా పంత్ పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడు మ్యాచ్ సిమ్యులేషన్ డ్రిల్స్‌లో పాల్గొంటున్నాడు. మంగళవారం ఒక సెషన్ పూర్తి చేయగా.. బుధవారం మరో రౌండ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండింటినీ విజయవంతంగా పూర్తి చేస్తే నవంబర్ 12న వెల్లింగ్టన్‌కు బయలుదేరుతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ఆసియా కప్: యూఏఈపై ఘన విజయం.. సెమీ ఫైనల్‌కు భారత్
ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్లు?.. బీసీసీఐ ప్లాన్ అదేనా!