డీఆర్ఎస్ తీసుకోవాలని బంగ్లాను రెచ్చగొట్టిన స్మిత్.. అంపైర్ వార్నింగ్
ABN , Publish Date - Aug 22 , 2026 | 03:31 PM
ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా కొనసాగుతోంది. అయితే తొలి రోజే మైదానంలో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్.. బంగ్లాదేశ్ ప్లేయర్లను డీఆర్ఎస్ తీసుకోవాలని రెచ్చగొట్టినట్లు కనిపించడంతో అంపైర్ అతడిని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా కొనసాగుతోంది. అయితే తొలి రోజే మైదానంలో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్.. బంగ్లాదేశ్ ప్లేయర్లను డీఆర్ఎస్ తీసుకోవాలని రెచ్చగొట్టినట్లు కనిపించడంతో అంపైర్ అతడిని హెచ్చరించారు. తొలి టెస్టులో బంగ్లా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఆసీస్ ప్లేయర్లు అగ్రెసివ్‌గా ఆడుతున్నారు. అయితే స్టీవ్ స్మిత్ ఎందుకలా చేశాడంటే..
అక్కడ మొదలైంది..!
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ వేసిన బంతి స్మిత్ ప్యాడ్లను తాకింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నాటౌట్‌గా ప్రకటించారు. కెప్టెన్ నజ్ముల్ షాంటో డీఆర్ఎస్ తీసుకుందామా? అని తస్కిన్‌ను అడిగాడు. వద్దు.. ఆ బంతి కాస్త పైకి వెళ్తున్నట్లు కనిపించిందని తస్కిన్ చెప్పాడు. అక్కడే ఆ సంభాషణను వింటున్న స్మిత్ కలగజేసుకుని.. లేదు మీరు రివ్యూ తీసుకోండి అన్నట్లుగా వీడియోల్లో రికార్డు అయింది. కానీ బంగ్లా ప్లేయర్లు డీఆర్ఎస్ తీసుకోలేదు. తర్వాత రీప్లేల్లో స్మిత్ బంగ్లాదేశ్ ఫీల్డర్ల వైపు చేతులతో సంకేతాలు చేస్తూ కనిపించాడు. దీంతో అతడు ప్రత్యర్థి జట్టును డీఆర్‌ఎస్ తీసుకునేలా రెచ్చగొట్టాడనే చర్చ మొదలైంది. ఈ ఘటన అనంతరం ఫీల్డ్ అంపైర్లు నితిన్ మీనన్‌తో పాటు మరో అంపైర్ స్మిత్ వద్దకు వెళ్లి మాట్లాడారు. స్మిత్ కూడా వారితో కొద్దిసేపు చర్చించిన తర్వాత ఆట తిరిగి కొనసాగింది.
తొలి రోజు ముగిసిన ఆట..
ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. బంగ్లాపై 101 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కామెరూన్ గ్రీన్(51*), నాథన్ లయాన్(10*) కొనసాగుతున్నారు. స్మిత్(42) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో షోర్‌ఫుల్ ఇస్లామ్ 6 వికెట్లతో చెలరేగాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 64 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు సహా కెప్టెన్ షాంటో కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. బౌలర్ షోర్‌ఫుల్ ఇస్లామ్(14) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6, ప్యాట్ కమిన్స్ 3, హేజిల్‌వుడ్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
వెనక్కి తగ్గం.. భారత్‌తో మ్యాచ్ ఆడుతాం: బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య
నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే బంగ్లా ఆలౌట్