టెస్ట్ క్రికెట్ అభివృద్ధి చెందాలంటే వైభవ్ లాంటి ప్లేయర్లు ఆడాలి: ద్రవిడ్
ABN , Publish Date - Aug 22 , 2026 | 01:13 PM
భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్‌లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అతడిని రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతో 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతడి బ్యాటింగ్ శైలీని పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తుంటారు. అంతేకాక అతడికి పలు సూచనలు సైతం చేస్తుంటారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ యువ హిట్టర్ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు.
ఐర్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్‌లోనూ అవకాశం కల్పించాలన్నారు. టెస్ట్ క్రికెట్ అభివృద్ధి చెందాలంటే వైభవ్‌లాంటి ఆటగాళ్లు ఆడాలని ద్రవిడ్ వెల్లడించారు. 15 ఏళ్ల వైభవ్‌ను రెడ్ బాల్ క్రికెట్‌లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల ద్వారా వైట్‌బాల్ అనుభవం సంపాదిస్తున్నాడని, అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో రెడ్‌బాల్ మ్యాచ్‌లు కూడా ఆడేలా చూడాలని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.
దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్‌కు వైభవ్ ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో ఈ టోర్నీ అతడి రెడ్‌బాల్ సామర్థ్యాలను పరీక్షించడానికి కీలకంగా మారనుందని ద్రవిడ్ అన్నారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌కు ఎంపిక కావాలంటే ఇలాంటి అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్ సూచించారు. ఇదే సమయంలో వైభవ్ విషయంలో క్రికెట్ అభిమానులకు ద్రవిడ్ కీలక సూచనలు చేశాడు.
వైభవ్‌పై అంచనాలు పెట్టుకునే విషయంలో తొందరపడకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ పెద్ద స్థాయిలో విజయాలు సాధించాడని, భవిష్యత్‌లో కూడా ఆటలో హెచ్చుతగ్గులు సహజమేనని, అందుకే అతడికి తగినంత సమయం ద్రవిడ్ సూచించారు. ద్రవిడ్ చెప్పినట్లుగా, వైభవ్ విషయంలో తొందరపడకుండా సమయం ఇవ్వడం కీలకమని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
వెనక్కి తగ్గం.. భారత్‌తో మ్యాచ్ ఆడుతాం: బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య
నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే బంగ్లా ఆలౌట్