ఐపీఎల్ 2026: విజృంభించిన హైదరాబాద్ బ్యాటర్లు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - May 22 , 2026 | 09:33 PM
ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. ఆర్సీబీకి 256 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ బ్యాటర్ల ధాటికి ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
అభిషేక్ శర్మ(56; 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఇషాన్ కిషన్(79; 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్(51; 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆఖరిలో వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి(29*; 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ట్రావిస్ హెడ్(26) మరోసారి విఫలమయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ దార్ 2, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్య తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్