Share News

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్

ABN , Publish Date - May 22 , 2026 | 07:15 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్
SRH vs RCB

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. ఆర్సీబీ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ పోరులో నెగ్గితే 20 పాయింట్లతో క్వాలిఫయర్‌కి చేరుకుంటుంది. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడినా, గెలిచినా స్థానం ఏమీ మారదు. ఒకవేళ భారీ మార్జిన్ తేడాతో విజయం సాధిస్తేనే టాప్ 2లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.


ఆర్సీబీ తుది జట్టు

రజత్ పాటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్య, రోమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ దార్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: టిమ్ డేవిడ్, కనిష్క్ చౌహాన్, స్వప్నిల్ సింగ్, అభినందన్ సింగ్, కాక్స్


ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు

ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), క్లాసెన్, సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్, నితీశ్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రఫుల్ హింగే, అనికేత్ వర్మ, లివింగ్‌స్టోన్, హర్ష్ దూబె, హర్షల్ పటేల్


ఇవి కూడా చదవండి:

మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం: స్టువర్ట్ బ్రాడ్

ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల దందా

Updated Date - May 22 , 2026 | 07:15 PM