Share News

స్పెయిన్ విషయంలో ఆ సెంటిమెంట్ పని చేసింది!

ABN , Publish Date - Jul 20 , 2026 | 07:39 AM

ఫిఫా ప్రపంచ కప్ 2026 విశ్వ విజేతగా స్పెయిన్ నిలిచింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాను ఓడించి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో స్పెయిన్‌కు సంబంధించిన ఓ సెంటిమెంట్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.

స్పెయిన్ విషయంలో ఆ సెంటిమెంట్ పని చేసింది!
Spain FIFA World Cup 2026 Champion

స్పోర్ట్స్ డెస్క్: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఫిఫా ప్రపంచ కప్‌ (FIFA World Cup 2026) విజేత ఎవరో తేలిపోయింది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో స్పెయిన్ సంచలనం నమోదు చేసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, టోర్నీలో బలమైన జట్టు అయిన అర్జెంటీనాను 1-0తో ఓడించి జగజ్జేతగా నిలిచింది. ఈ క్రమంలో ఓ సెంటిమెంట్‌ రిపీట్ కావడం గమనార్హం. మరి అదేంటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ గెలవడం స్పెయిన్‌కు ఇది రెండో సారి. దాదాపు16 ఏళ్ల క్రితం అంటే 2010లో చివరి సారిగా స్పెయిన్ ఫిఫా ట్రోఫీని ముద్దాడింది. అంతకుముందు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేదు. తాజాగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుని ఏకంగా విశ్వవిజేతగా నిలిచింది. దీంతో స్పెయిన్ విషయంలో ఫైనల్‌కు చేరడం అనే సెంటిమెంట్ పనిచేసిందని ఆ దేశ అభిమానులతో పాటు క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


తమ జట్టు ఫైనల్‌కు వస్తే కప్‌ కొట్టడం ఖాయమని స్పెయిన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1950లో ఒకసారి స్పెయిన్ సెమీస్‌ వరకు వచ్చింది. కానీ, అక్కడ ఓడింది. ఆ తర్వాత మూడో స్థానం కోసం జరిగిన పోరులోనూ ఓటమిపాలైంది. ఆఖరికి నాలుగో స్థానంతో ఆ ఎడిషన్‌ను ముగించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. 1-0 తేడాతో అర్జెంటీనాను ఓడించిన స్పెయిన్ సంచలనం నమోదు చేసింది.


Also Read

హిట్‌మ్యాన్‌ శతక్కొట్టినా..

సింధు చరిత్ర

ముగింపులో గానామృతం

Updated Date - Jul 20 , 2026 | 07:59 AM