ముగింపులో గానామృతం
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:37 AM
ఫిఫా వరల్డ్‌కప్ ముగింపు వేడుకల్లో ప్రఖ్యాత గాయకులు తమ గాన మాధుర్యంతో అభిమానులను అలరించారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్ల మధ్య ఫైనల్‌కు...
ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన అమెరికా అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్
ట్రోఫీని తీసుకొస్తున్న అల్కారజ్, ముగింపు వేడుకల్లో ఐషో స్పీడ్ బృందం
న్యూజెర్సీ: ఫిఫా వరల్డ్‌కప్ ముగింపు వేడుకల్లో ప్రఖ్యాత గాయకులు తమ గాన మాధుర్యంతో అభిమానులను అలరించారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్ల మధ్య ఫైనల్‌కు ముందు అర్ధగంటపాటు జరిగిన ఈ కార్యక్రమం మ్యూజికల్ ఫెస్టివల్‌ను తలపించింది. యూట్యూబ్ సెన్సేషన్ ఐషో స్పీడ్ అందరికంటే ముందు వేదికపై వచ్చి తన వరల్డ్‌కప్ ‘చాంపియన్స్’ గీతంతో ప్రేక్షకుల్లో జోష్ నింపాడు. అనంతరం కౌబాయ్ టోపీ, జీన్స్ ధరించిన పోస్ట్ మలోన్ తన సహచర అమెరికన్ సింగర్ స్వే లీతో కలిసి తమ హిట్ సాంగ్స్‌ను ఆలపించారు. ఇక చివర్లో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ మాట్లాడుతూ ‘ఫుట్‌బాల్ మనందరినీ ఏకం చేస్తుంది’ అని కొనియాడాడు. అలాగే ఫిఫా వరల్డ్‌క్‌పను స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారజ్ స్టేడియంలోకి తీసుకొచ్చాడు.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!