రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్.. పంజాబ్ తరఫున బరిలోకి..!
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:37 PM
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి దేశవాళీ క్రికెట్లో సందడి చేయనున్నాడు. రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌తో జరగనున్న మ్యాచ్‌లో గిల్.. పంజాబ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి దేశవాళీ క్రికెట్లో సందడి చేయనున్నాడు. రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్‌తో పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గిల్ ఆడనున్నాడు. మరో ఐదు రోజుల్లోనే భారత్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్‌తో నవంబర్ 4 నుంచి వన్డేలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడనుంది. ఇప్పటి నుంచి దాదాపు రెండు వారాల పాటు గిల్ ఖాళీగానే ఉండనున్నాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధమవ్వడం విశేషం. కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్ నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం ఈ రంజీ మ్యాచ్‌ను వినియోగించుకోవాలని గిల్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్ చేరుకోవాలంటే న్యూజిలాండ్ సిరీస్ అత్యంత కీలక కానుంది. గతంలో ఏ భారత కెప్టెన్ తీసుకోని నిర్ణయాన్ని గిల్ తీసుకున్నాడు. ఐదుగురు వ్యక్తిగత నెట్ బౌలర్లను న్యూజిలాండ్‌ను తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. అందుకు అయ్యే ఖర్చును తానే భరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీసీఐ పలువురిని నెట్ బౌలర్లుగా పంపించనున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా
యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!