Share News

భారత టీ20 జట్టుపై ప్రశ్న.. రిపోర్టర్‌కు గిల్ షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:15 PM

భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ఓ రిపోర్టర్‌కు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ అనంతరం ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన గిల్‌ను ఓ రిపోర్టర్ టీ20 జట్టు సన్నాహకాలపై ప్రశ్న అడిగాడు.

భారత టీ20 జట్టుపై ప్రశ్న.. రిపోర్టర్‌కు గిల్ షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ఓ రిపోర్టర్‌కు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ అనంతరం ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన గిల్‌ను ఓ రిపోర్టర్ టీ20 జట్టు సన్నాహకాలపై ప్రశ్న అడిగాడు. దీంతో టీ20ల్లో తాను లేనంటూ బదులిచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.


వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ జరుగుతున్న సమయంలో భారత టీ20 జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్‌ వెళ్లింది. అక్కడ పురుషుల క్రికెట్‌లో భారత్‌ తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం స్వదేశానికి తిరిగొచ్చిన టీ20 జట్టు.. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. తొలి టీ20కి ముందు గిల్‌ను ఓ విలేకరి ఆసియా క్రీడల్లో భారత్‌ స్వర్ణం సాధించడంపై అభిప్రాయం అడిగాడు. దీనికి గిల్‌.. ‘భారత జట్టుకు, నా సహచర ఆటగాళ్లకు అభినందనలు’ అని చెప్పాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు సన్నాహకాల గురించి రిపోర్టర్ గిల్‌ను ప్రశ్నించాడు. దీనికి గిల్‌ కాస్త చురుగ్గా స్పందిస్తూ.. ‘టీ20ల్లో నేను లేను కదా’ అని బదులిచ్చాడు. గిల్‌ చివరిసారిగా 2025 డిసెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఆడాడు. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్‌ జట్టులో అతడికి చోటు దక్కని సంగతి తెలిసిందే.


వన్డేల్లో అదరగొట్టిన గిల్‌

టీ20 జట్టులో లేకపోయినా.. వన్డేలు, టెస్టుల్లో గిల్‌ భారత క్రికెట్‌లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గిల్‌ ఏకంగా 334 పరుగులు చేశాడు. ఇందులో అజేయంగా 223 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ కూడా ఉంది. దీంతో అతడికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. భారత్‌ ఈ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.


ఇవి కూడా చదవండి:

సూర్యకుమార్‌కు షాక్.. రంజీ ట్రోఫీలోనూ దక్కని చోటు

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బాధ్యత అదే: టీమిండియా బౌలింగ్ కోచ్

Updated Date - Oct 06 , 2026 | 12:15 PM