Share News

నన్ను వ్యతిరేకించినా సరే.. పాకిస్థాన్‌కు గుర్తింపు తెచ్చిందే ఇమ్రాన్ ఖాన్: రవి శాస్త్రి

ABN , Publish Date - Oct 06 , 2026 | 10:56 AM

పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌కు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి మద్దతుగా నిలిచాడు. ఇమ్రాన్‌ ఖాన్‌ పట్ల పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు అమానవీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

నన్ను వ్యతిరేకించినా సరే.. పాకిస్థాన్‌కు గుర్తింపు తెచ్చిందే ఇమ్రాన్ ఖాన్: రవి శాస్త్రి
Ravi Shastri

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌కు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి మద్దతుగా నిలిచాడు. ఇమ్రాన్‌ ఖాన్‌ పట్ల పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు అమానవీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న ఇమ్రాన్‌ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని శాస్త్రి కోరాడు.


‘నేనేమీ రాజకీయ నాయకుడిని కాదు. కానీ ఇమ్రాన్‌ ఖాన్‌తో ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూస్తే షాక్‌కు గురవుతున్నా. ఒక మనిషితో ఇలా వ్యవహరించకూడదు. మానవతా దృక్పథంతో చూస్తే ఆయనకు జరుగుతున్నది ఏమాత్రం సమర్థనీయం కాదు. నా అభిప్రాయం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రికెటర్లు ఇదే భావనను వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌కు ఇమ్రాన్‌ చేసిన సేవలు ఎంతో ప్రత్యేకమైనవి. నా దృష్టిలో ఆయన అద్భుతమైన నాయకుడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించి.. వారిని విజయవంతమైన క్రికెటర్లుగా తీర్చిదిద్దాడు. దాదాపు 40 ఏళ్ల వయసులో కెప్టెన్‌గా ఉండి యువ జట్టుతో ప్రపంచకప్‌ గెలిచారు’ అని రవి శాస్త్రి గుర్తు చేశాడు.


పాక్‌కు గుర్తింపు తెచ్చాడు..

‘ఆయన త్వరగా బయటకు వచ్చి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నా. మీరు రాజకీయాల గురించి ఏమైనా అనుకోవచ్చు. కానీ ఆయన సెల్‌లో అలా ఉండాల్సిన వ్యక్తి మాత్రం కాదు. పాకిస్థాన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి అతను. నన్ను వ్యతిరేకించినా సరే.. నా మాటలు నచ్చినా నచ్చకపోయినా.. ఇది నా అభిప్రాయం’ అని శాస్త్రి స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

సూర్యకుమార్‌కు షాక్.. రంజీ ట్రోఫీలోనూ దక్కని చోటు

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బాధ్యత అదే: టీమిండియా బౌలింగ్ కోచ్

Updated Date - Oct 06 , 2026 | 10:56 AM