Share News

నేనైతే అతడిని జట్టులోనే ఉండనివ్వను: షాదాబ్ ఖాన్‌పై పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 02 , 2026 | 08:21 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలోనే పాకిస్థాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్, షాహిన్ అఫ్రిది వంటి సీనియర్ ప్లేయర్లు తీవ్రంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. షాదాబ్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నేనైతే అతడిని జట్టులోనే ఉండనివ్వను: షాదాబ్ ఖాన్‌పై పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Shadab Khan

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలోనే పాకిస్థాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజి నుంచే తీవ్ర కష్టాలు పడుతూ గెలుస్తూ ఓడుతూ.. సూపర్ 8కు చేరుకుంది. ఆ జట్టు సీనియర్ ప్లేయర్ల ఫామ్ లేమి వల్ల పాక్‌కు ఓటమి తప్పలేదు. బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్, షాహిన్ అఫ్రిది వంటి సీనియర్ ప్లేయర్లు తీవ్రంగా విఫలమయ్యారు. దీంతో పాక్ కెప్టెన్ పదవి నుంచి సల్మాన్ అలీ అఘాను తప్పిస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తదుపరి కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. షాదాబ్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.


‘షాదాబ్ ఖాన్‌కు కెప్టెన్సీనా? అతడి ప్రదర్శన చూశారా? నాకే ఆ అవకాశం వస్తే కెప్టెన్సీ మాట అటు ఉంచితే.. అతడిని జట్టులోనే ఉండనివ్వను. కోచ్ మైక్ హెస్సెన్‌కు అతడికి మంచి సంబంధాలు ఉన్నాయి. అతడు కోచ్‌గా కొనసాగితే షాదాబ్ ఖాన్‌కు ఇంకా అవకాశాలు వస్తాయి. ఇస్లామాబాద్‌లో పీఎస్ఎల్‌లో ఉన్ననాటి నుంచి వారికి అనుబంధం ఉంది. అందుకే అతడికి వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. ప్రదర్శన పరంగా చూస్తే అతడు జట్టులో ఉండటానికే అర్హుడు కాదు. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే జట్టుకు దూకుడుగా ఉండే కెప్టెన్ అవసరం. ఆ లక్షణాలన్నీ ఫఖర్ జమాన్‌లో ఉన్నాయి. అతడు కెప్టెన్ పదవికి సరిగ్గా సరిపోతాడు’ అని షాహిద్ అఫ్రిది అన్నాడు. ఈ టోర్నీలో షాదాబ్ ఖాన్ 7 మ్యాచ్‌ల్లో 118 పరుగులు, 5 వికెట్లు మాత్రమే తీసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

Updated Date - Mar 02 , 2026 | 08:21 PM